ఫాస్ట్ ఫుడ్ మంచిది కాదు అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. కానీ ఎందుకు తినకూడదు తింటే ఏమవుతుంది ?

జీవితం బిజీబిజీగా అయిపోయింది. మరీముఖ్యంగా మహానగరాల్లో ఉండేవాళ్ళ బాధలు వర్ణించడం కష్టం. పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళాంటే గంటలకొద్ది ట్రాఫిక్ లో ఉండాలి. రోజంతా పనిచేసి మళ్ళీ గంటలకొద్దీ రద్దిలో ప్రయాణించాలి. అందుకే అలసిపోతుంటారు. ఇంటికి వచ్చి, వండుకోని తినేంత ఓపిక చాలాసార్లు ఉండట్లేదు. అందుకే ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడ్డారు. సాయంత్రం అవగానే అలా ఫాస్ట్ ఫుడ్ తినేయటం లేదా రాత్రి ఇంటివంట కోసం ఎదురుచూసే ఓపిక లేక రెస్టారెంట్లలో వాలిపోతుంటారు. కాని ఫాస్ట్ ఫుడ్ ఒంటికి మంచిది కాదు అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే .. ఎందుకు మంచిది కాదు అంటే ...
  • ఫాస్ట్ ఫుడ్ లో కాలరీలు అతిగా ఉంటాయి. మనకు ఓపూట దొరకాల్సిన దాని కన్నా ఎక్కువ కాలరీలు శరీరంలోకి చేరిపోతూ ఉంటాయి. ఇక్కడే ప్రమాదం మొదలయ్యేది.
  • ఫాస్ట్ ఫుడ్ వంటకాల్లో నాణ్యత లేని నూనె వాడుతున్నారని, మాంసాహారం కూడా తాజాగా ఉండదని ఎన్నో కంప్లయింట్స్ ఉన్నాయి. అలాంటి వంటకాలకి దూరంగా ఉండటమే మంచిది !
  • ఫాస్ట్ ఫుడ్ తరుచుగా తినేవారు అధికబరువు సమస్యలతో బాధపడటం దాదాపు ఖాయం. శరీరంలోకి బాగా కొవ్వుని ఇంజెక్ట్ చేస్తాయి ఫాస్ట్ ఫుడ్ వంటకాలు.
  • చాలా రకాల ఫాస్ట్ ఫుడ్ పదార్థాల్లో ట్రాన్స్ ఫ్యాట్ (Trans Fat)వాడతారు. దీని వలన మన లివర్ పాడయ్యే ప్రమాదం ఎన్నో రేట్లు పెరిగిపోతుంది. ఇది మద్యం తాగడంతో సమానమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
  • ఫాస్ట్ ఫుడ్ వలన గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తీవ్రస్థాయిలో పెరుగుతుంది. కోలెస్టరాల్ లెవెల్స్ ని అమాంతం పేంచేయగలదు ఈ ఫాస్ట్ ఫుడ్ తిండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)