ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలే మన దంతాలను కాపాడతాయి.. దంత సమస్యలు రాకుండా ఈజీ చిట్కాలు

ఒకప్పుడు దంత సమస్యలు అనేవి ఎక్కువగా పెద్దవారిలోనే కన్పించేవి. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ సమస్య టీనేజర్స్ లో కనపడుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే ఈ సమస్య నుండి సమర్ధవంతంగా బయట పడవచ్చు.
  • ప్రతి రోజు మూడు నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి. బ్రష్ ని నేరుగా చిగుళ్లపై పెట్టి బ్రషింగ్ చేయకూడదు. ఈ విధంగా చేస్తే రక్త స్రావం అయ్యే అవకాశం ఉంది. చిగుళ్ల మీద ఒత్తిడి పడకుండా సున్నితంగా బ్రష్ చేయాలి. 
  • చాలా మంది దంతాలు అందంగా కనపడాలని తీగలను వేయించుకుంటారు. తీగలను వేయించుకున్న వారు ఆహారం తీసుకున్న ప్రతి సారి పళ్ళను శుభ్రం చేసుకోవటం తప్పనిసరి. ఈ విధంగా శుభ్రం చేసుకోకపోతే దంత క్షయం ఏర్పడే అవకాశం ఉంది. 
  • నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవాలి. జామపండు, యాపిల్, పుచ్చకాయ వంటి ఆహారాలు దంత ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. 
  • బ్రష్ చేసుకొనే విషయంలో కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నోటి పరిమాణాన్ని బట్టి బ్రష్ ని ఎంపిక చేసుకోవటం ముఖ్యం. ఒకవేళ బ్రష్ పెద్దది అయితే చివరి దంతాలను శుభ్రం చేయటం కష్టం. ఈ జాగ్రత్తలను పాటిస్తే దంత సమస్యలు రాకుండా ఉంటాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)