ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ 500 రోజుల్లో 108 కిలోలు ఎలా తగ్గాడో తెలుసా ?

Loading...
ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ బరువు తగ్గాడు. సాధారణంగా బరువు తగ్గడం అంటే ఏ 20 కిలోలు, 30 కిలోలు తగ్గుతారు. కానీ అనంత్ అంబానీ ఏకంగా 108 కిలోలు తగ్గాడు. అదీ 18 నెలల్లో. అయితే ఇంత మార్పు రావడం వెనుక అతను పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. రోజుకు 6 గంటలు జిమ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. రోజుకు 21 కిలోమీటర్లు వాకింగ్ చేసేవాడట. యోగా చేసేవాడట. అనంత్ అంబానీ చిన్నప్పుడు క్రోనిక్ అస్తమాతో బాధపడేవాడు. అందువల్ల బరువు విపరీతంగా పెరిగాడు. అనంత్‌లో ఇంత మార్పు కలగడం తనకెంతో ఆనందానిచ్చిందని నీతా అంబానీ చెబుతోంది. తన కొడుకుకి ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధను మెచ్చుకుంది. పట్టుదల, శ్రమ ఉంటే సాధించలేనిది ఏదీ లేదన్న దీరూభాయ్ అంబానీ మాటలను అనంత్ నిజం చేశాడని తెగ సంబరపడిపోతున్నారు. ఊబకాయంతో బాధపడేవారికి అనంత్ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నట్లు నీతా అంబానీ చెబుతున్నారు.
Loading...

Popular Posts