బెడ్ రూం లో దేవుడిని పెట్టొచ్చా? చాలా మందికి ఓ ధర్మ సందేహం

పడకగదిలో దేవుడా? చాలా మందిని ఓ ధర్మ సందేహం తెగ పీడిస్తోంది. పడకగదిలో దేవుడిని పెట్టొచ్చా? పెడితే ఏ దిశలో పెట్టాలి? అక్కడ దేవునికి పూజలు చెయ్యొచ్చా? హారతులు ఇవ్వొచ్చా? ఇలా ఎన్నో సందేహాలు. అయితే శాస్త్రం ప్రకారం శయన మందిరంలో(పడకగదిలో) దేవుని పూజ నిషిద్ధం. నిద్ర లేచిన తరువాత దేవుడు ముఖం చూడటం వరకు పడకగదిలో దేవుని చిత్రాలు లేదా ఫోటోలు ఉండవచ్చు. పూజ చేసే విగ్రహాలు కానీ, పటాలు కానీ పడకగదిలో పెట్టకూడదు. శయన మందిరం దైవిక క్రియలు చెయ్యడానికి పనికిరాదు. ఏది ఎక్కడ చెయ్యాలో అది అక్కడ చెయ్యాలి.

దేవుడు సర్వాంతర్యామి అనే మాట అక్షరాలా నిజం. నిత్యం మనసంతా దేవుడే తప్ప రెండో ఆలోచన లేని వారికే ఆ మాట వర్తిస్తుంది. అంతే కానీ అందరికీ పనికి రాదు. దైవ మందిరంలో వుండే వైబ్రేషన్ వేరు, పడకగదిలో వుండే వైబ్రేషన్ వేరు. అందుకే దర్శనం వరకు చిత్రాలు పెట్టుకోవచ్చు కానీ, పడకగదిలో పూజలు నిషిద్ధం అంటుంది హిందూ ధర్మం.
లైంగిక కార్యకలాపాలు జరిగే గదిలో దేవుని పటాలు ఉంటే నెగటివ్ వైబ్రేషన్స్ జనించే అవకాశం ఎక్కువ. పడక గదిలో ఇలాంటివి జరిగేట్టయితే దేవుని పటాలు ఉండకూడదు.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)