ఈ విధంగా నీటిని తాగితే కేవ‌లం 10 రోజుల్లోనే బ‌రువు త‌గ్గుతారు

మీకు తెలుసా..? నీటి వల్లే మ‌నం అధిక శాతం బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని! అవును, మీరు విన్న‌ది నిజమే..! కింద సూచించిన విధంగా నీటిని తాగితే కేవ‌లం 10 రోజుల్లోనే 5 కిలోల బ‌రువు త‌గ్గుతారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
  • టీ, కాఫీ తాగేముందు ఒక గ్లాస్ నీటిని తాగండి. ఇది క‌డుపులో ఏర్ప‌డే అసిడిటీ, గ్యాస్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డ‌మే కాదు, అధిక బ‌రువును కూడా త‌గ్గిస్తుంది.
  • ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌డానికి ముందు గానీ, బ్రేక్‌ఫాస్ట్ చేసిన త‌రువాత గానీ ఒక గ్లాస్ నీరు తాగాలి.
  • మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేయ‌డానికి అర‌గంట ముందు ఒక గ్లాస్ నీటిని తాగాలి. దీంతో ఆక‌లి త‌గ్గుతుంది. త‌ద్వారా క‌డుపు నిండిన భావ‌న క‌లిగి భోజ‌నం కూడా త‌క్కువ‌గా తింటాం.
  • రాత్రి నిద్రించ‌డానికి గంట ముందు ఒక గ్లాస్ నీటిని తాగాలి. అది అర్థ‌రాత్రి స‌మయంలో క‌లిగే ఆక‌లిని నియంత్రిస్తుంది.
  • పైన చెప్పిన స‌మయాల్లో కాకుండా రోజు మొత్తంగా వివిధ స‌మ‌యాల్లో 9 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి. ఇది శ‌రీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దీంతోపాటు అధిక బ‌రువును కూడా త‌గ్గిస్తుంది.
  • సోడా, జ్యూస్ వంటివి తాగాల్సి వ‌చ్చిన‌ప్పుడు వాటికి బ‌దులుగా ఒక్కో గ్లాస్ నీటిని తాగండి. దీంతో శ‌రీరంలో అద‌న‌పు షుగ‌ర్స్ చేర‌వు. బ‌రువు కూడా త‌గ్గుతారు.
  • బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేసినా గానీ ఆక‌లిగా ఉంటే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక నిమ్మ‌కాయ‌ను పూర్తిగా పిండి ఆ మిశ్ర‌మాన్ని తాగండి. దీంతో ఆక‌లి త‌గ్గుతుంది. మ‌ళ్లీ ఆక‌లి వేయ‌దు. బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు.
పైన చెప్పిన విధంగా నీటిని రోజూ తాగుతూ, స‌రైన వేళ‌కు భోజ‌నం చేస్తూ, వ్యాయామం చేస్తుంటే అతి త‌క్కువ వ్య‌వ‌ధిలోనే సుల‌భంగా అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.

Popular Posts

Latest Posts