ఉదయం నిద్ర లేచిన తర్వాత చేయాల్సిన పనులు తినాల్సిన ఆహారము

ప్రతిరోజూ ఉదయం లేచింది మొదలు రాత్రిపడుకునే వరకు ఉరుకులు పరుగులతోనే పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు.
జీవనశైలిలో మార్పులు, తిండి, నిద్రకు నిర్ణీత సమయాన్ని పాటించకపోవడం వల్ల జీవక్రియ రేటు సరిగా ఉండదు. ఇలాంటి వాటిని దూరం చేసుకోకపోతే.. ఆరోగ్యం మీద ఆ ప్రభావం పడుతుంది. అందుకే ఇవన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోవడంతోపాటు నిద్రలేవగానే కనీసం ఐదారు గ్లాసుల నీళ్లు తాగేలా ప్రణాళిక వేసుకోవాలి. ఏమీ తినకుండా నీళ్లు తాగడం వల్ల శరీరంలోని కణాలు ఉత్తేజితమయ్యి జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
తర్వాత చేయాల్సిన పని వ్యాయామం. చాలామంది మేము చేసే పనే పెద్ద వ్యాయామం. దీనికి మరల సమయాన్ని కేటాయించాలా? అని అంటుంటారు. కానీ ఉదయం పూట తప్పనిసరిగా వ్యాయామం చేస్తే మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకు దొరికే ఈ కొద్దిసమయాన్ని మనకోసం కేటాయించుకునే వెసులుబాటు కూడా ఇదే. అంతేకాదు, శరీరంలో మేలు చేసే హార్మోన్లు విడుదలై పలు సమస్యలతో పోరాడతాయి కూడా.
ఉదయంపూట తప్పనిసరిగా తీసుకోవాల్సింది అల్పాహారం. నిద్రలేచిన గంటలోపే అల్పాహారం తీసుకోవాలి. ముఖ్యంగా ప్రొటీన్లు లభించే గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, రాత్రి, పగలుకు మధ్య గ్యాప్‌ను పూడ్చి మెదడుకు గ్లూకోజ్‌ను అందిస్తాయి. దాంతో శరీరం పునరుత్తేజితమవుతుంది.
అంతేకాదు, ఉదయం పూట రెండు మూడు టీలు తాగందే.. రోజు గడవదు కొందరికి. వాటికి బదులు గ్రీన్‌ టీ తాగడం అలవాటు చేసుకుంటే మంచిది. గ్రీన్‌ టీలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి.. రోగనిరోధకక్తిని పెంపొందిస్తాయి. పండ్ల రసాలు కూడా తీసుకోవచ్చు.
అన్నింటికంటే ముఖ్యంగా సానుకూల దృక్పథంతో ఉండాలి. ఈ ఆలోచనల ప్రభావం రోజంతా ఉత్సాహంగా ఉండటానికి దోహదపడుతుంది. ఇది ఉత్పాదకత పెరగడానికీ కారణమవుతుంది అంటున్నారు నిపుణులు. పైగా ఒత్తిడి దూరమవుతుంది. ఆరోగ్యానికీ మేలు.
కాబట్టి, ఈ అలవాట్లను తప్పక పాటిస్తే.. రోజంతా ప్రశాంతంగా, ఏకాగ్రతతో పనులు చేసుకోవడానికి తోడ్పడుతుంది. అందం కూడా ద్విగుణీకృతమవుతుంది. మరెందుకు ఆలస్యం.. వెంటనే ప్రారంభించండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)