అర్థరాత్రి ఓ వ్యక్తి కోట్ల రూపాయలతో దొరికాడు.. అతను దొంగిలించలేదు మరి అంత డబ్బు ఎక్కడిది అని ప్రశ్నిస్తే అతని జవాబుకి పోలీసులు షాక్ అయ్యారు

Loading...
డ్రంక్ అండ్ డ్రైవ్ లో అర్థ రాత్రి తాగి రోడ్డు మీద తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు తనిఖీ చేయగా అతని వద్ద భారీ మొత్తంలో డబ్బులు ఉన్నట్లు గమనించారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మె విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని పేరు సందీప్ కుమార్. అతను ఇండియాలోనే అత్యంత ఖరీదైన బెగ్గర్. అతని ఆస్తులు అక్షరాల కోట్లలోనే ఉంటుంది. మార్కెట్ విలువ ప్రకారం దానికి రెట్టింపే ఉండొచ్చు, ఉంటుంది కూడా. ఈయన రోజుకి రూ 2500-3000, నెలకు 75000 పై మాటే. అలా వచ్చిన డబ్బుతోనే ముంబయ్ లోని పరేల్ ప్రాంతంలో రెండు ఫ్లాట్లు.., మరో షాప్ ను నడుపుతున్నాడు. వాటి అద్దె మరో రూ 63000 రూపాయల వరకూ ఉంటుంది.  

ఒక్క భారత్ లోనే కొన్న లక్షలాది మంది బిలీనియర్ బెగ్గర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లి బిక్షాటన చేస్తారు. అలా వచ్చిన డబ్బులతో తమ పర్మినెంట్ ప్లేస్ లో ఇళ్లు, విలాసవంత మైన భవనాలు ఏర్పరుచుకుంటారని తేలింది. అంతే కాదు వీరిలో సీజనల్ యాచకూలు కూడా ఉంటారంటా వాళ్లు పండగటైంలో యాచిస్తారు. మరో రకం బిచ్చగాళ్లు ముంబై, హైదరాబాద్, కోల్ కతా వంటి నగరాల కూడళ్లలో పిల్లల్ని చేతబట్టుకొని యాచిస్తారు. ఆ పిల్లలకు కూడా గంటల చొప్పున డబ్బు చెల్లిస్తారు. పిల్లల్ని వెంట తెచ్చుకోవడం వల్ల రోజు వారి సంపాదనకంటే ఎక్కువ మొత్తంలో అర్జిస్తారట. వాళ్లు రాని పక్షంలో పిల్లల్ని చిత్ర హింసలకు గురిచేస్తారని పోలీసుల విచారణ లో వెల్లడైంది.
Loading...

Popular Posts