అబ్బాయిల్లో ఉండే ఈ 7 లక్షణాలు అమ్మాయిలకు అస్సలు నచ్చవు

యూత్ లో ఉన్న ప్రతీ ఒక్క అబ్బాయి తనకి తోడుగా ఒక అమ్మాయి ఉండాలని కోరుకుంటాడు. అలా కోరుకోకపోతే వాడు తేడా అనుకుంటారు మరి. తాను ఇష్టపడిన అమ్మాయి వేరొకరికి పడిపోయిందంటే ఆ బాధ వర్ణించలేనిది. ప్రపంచంలో ఉన్న బాధ అంతా వీరికే ఉన్నట్టు ఫీలైపొతారు. వాడికెలా పడిపోయింది రా.... అంటూ ఫ్రెండ్స్ దగ్గర వాపోతారు. కొన్ని సార్లు అబ్బాయిలు చేసే పొరపాట్లువల్లే అమ్మాయిలు దూరమవుతారు. అబ్బాయిలలో కొన్ని లక్షణాలు అమ్మాయిలకు చిరాకు తెప్పిస్తాయి..! అందుకే దూరమవుతుంటారు..! ఆ లక్షణాలేంటో ఒక్కసారి చూద్దాం..!!
  • అబ్బాయిలు, అమ్మాయులు ఎన్నటికి సమానం కాదు.. అబ్బాయిలే అన్నిటిలోనూ ఎక్కువ అనేవారు చాలా మంది ఉంటారు. ఒకవేళ మీకు కూడా అలాంటి ఆలోచనే ఉంటె.. అది మీ దగ్గరే పెట్టుకోండి. పొరపాటున కూడా అమ్మాయిలతో ఈ మాట అనకండి. నిజానికి ఈ సమాజంలో ఇద్దరు సమానమే..!! ఎవరి వాల్యూస్ వారికీ ఉంటాయి. అది డిసైడ్ చేయాల్సింది మీరు కాదు కాబట్టి.. ఆ విషయాన్ని పక్కకు పెట్టేయండి.
  • కొందరు అబ్బాయిలు అన్నిటికి వాదిస్తారు. అమ్మాయిలు ఏది మాట్లాడినా అందులో ఏదో ఒక విషయం పై వాదన మొదలపెడతారు. ఇలాంటి అబ్బాయిలంటే అమ్మాయిలకు చెడ్డ చిరాకు. ప్రశాంతమైన సమయం గడుపుదామనుకుంటే... ఆ సందర్భం కాస్తా అసెంబ్లీ సమావేశాల్లా తయారవుతుంది. ఇలాంటి వారితో మాట్లాడంకన్నా ఒంటరిగా ఉండడం నయ్యం అనుకుంటారు.
  • అమ్మాయిని బయటకు ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు అన్నిటిలోను బడ్జెట్ గురించి ఆలోచించేవారంటే అమ్మాయిలకు పరమ చిరాకు. ఉదాహరణకు.... దాహమేస్తుందంటే వాటర్ బాటిల్ బదులు నీళ్ళ ప్యాకెట్ కొనిస్తే దానంత దరిద్రం ఇంకొకటి ఉండదు. చిన్న చిన్న వాటిలో బడ్జెట్ గురించి ఆలోచిస్తే.. ఆ అమ్మయి చచ్చినా ఇంకొకసారి మీతో బయటకు రాదూ.
  • రోడ్డు పై అమ్మాయి కనిపిస్తే చాలు.. అబ్బాయిల కళ్ళు ఆటోమేటిక్ గా వారి వైపు తిరిగిపోతాయి. కొందరు అదే పనిగా చూస్తే ఇంకొందరు తెలియకుండానే అమ్మాయిని చూసేస్తారు. కాని మీతో ఒక అమ్మాయి ఉన్నప్పుడు అలా చూస్తే మీరు బుకైనట్టే. నేను ఉండగా.. పరాయి స్త్రీ వంక అలా చూస్తున్నాడంటే.. నేను లేనప్పుడు ఇంకెలా ప్రవర్తిస్తాడో అనే అనుమానం వస్తుంది. ఇలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు.
  • అమ్మాయిలు అహంకారంగా ఉన్న అబ్బాయిలకే పడిపోతారని ఇటీవల ఆస్ట్రియా లో జరిపిన ఓ సర్వేలో తేలింది. కాని అదే అహంకారం ఎవరిమీద పడితే వారిమీద చూపిస్తే.. మొదటికే మోసం వస్తుంది. మీ కింది వారితో దురుసుగా ప్రవర్తించడం... ఎవరికీ సాయం చేయకపోవడం లాంటివి అమ్మాయిలకు చిరాకు తెప్పిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
  • అబ్బాయిలు ఒక ఓపెన్ బుక్ లా ఉండడం అమ్మాయిలకు ఇష్టముండదు. నేను ఏ విషయం చెబితే ఎలా రియాక్ట్ అవుతాడో అన్న సస్పెన్స్ లేకపోతే మజ ఏముంటుంది చెప్పండి. ఇలాంటి అబ్బాయిలు అమ్మాయిలను సర్‌ప్రైజ్ చేయడంలో ఫ్లాప్ అవుతారు. కాబట్టి వీళ్ళకి దూరంగా ఉండటమే కరెక్ట్ అనుకుంటారు అమ్మాయిలు. చిన్న చిన్న సర్‌ప్రైజ్ లేని జీవితం ఎంతైనా వృధానే కదా!
  • అమ్మాయిలకు కష్టాలు చెప్పుకొని బాధపడే అబ్బాయిలంటే కాస్త దూరంగా పెడతారు. నిజానికి ఏ అమ్మాయి అయినా కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారు. అంతేగాని చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడేవారంటే ఆమడ దూరంలో పెడతారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)