నిద్ర మానవ శరీరానికి దివ్య ఔషధం.. మీ వయసుని బట్టి ఎంతసేపు నిద్రపోవాలో తెలుసా ?

Loading...
మనుషులకు నిద్ర, ఆహారం, నీళ్లు, ఆక్సిజన్ చాలా అవసరం. బతకాలంటే.. ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సిందే. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలపడానికి నిద్ర చాలా ముఖ్యమైనది. మన జీవితకాలంలో దాదాపు మూడో వంతు భాగం నిద్రకే కేటాయిస్తాం. మనమంతా రాత్రి బాగా నిద్రపట్టాలని.. నిద్రపోవాలని కోరుకుంటాం. అయితే కొంతమంది 8గంటలు లేదా 7గంటల నిద్ర సరిపోతుందని చెబుతూ ఉంటారు. ఇది కరెక్టేనా ? ఎవరైనా ఇంత సమయం నిద్రపోతే సరిపోతుందా ?

లేదు.. నిద్రపోయే సమయానికి కూడా అధ్యయనాలు చాలా విషయాలు చెబుతున్నాయి. మన వయసుని బట్టి.. ఎవరు ఎంత సమయం నిద్రపోవాలి అనే విషయం తేల్చాయి ఈ స్టడీస్. వయసుకి తగినంత సేపు నిద్రపోకపోతే… అది మన ఆరోగ్యం, జీవనశైలిపై దుష్ర్పభావం చూపుతుంది. కాబట్టి మీ వయసును ఇక్కడ చెబుతున్న క్యాల్కులేషన్స్ తో తెలుసుకుని.. ఇకపై సరిపోయేంత నిద్ర పొందేలా జాగ్రత్త పడండి. కొన్నేళ్లపాటు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. ఏ వయసు వాళ్లు ఎంతసేపు నిద్రపోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ వయసుని బట్టి ఎంతసేపు నిద్రపోవాలో తెలుసా ?

పుట్టిన బేబీకి మూడునెలలు వచ్చే వరకు రోజుకి 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి.

4 నుంచి 11 నెలల పిల్లలు
4 నుంచి 11 నెలల వచ్చేవరకు పిల్లలు 12 నుంచి 15 గంటలు నిద్రపోయేలా జాగ్రత్త పడాలి.

1 నుంచి 2 ఏళ్లలోపు పిల్లలు
1 నుంచి 2 ఏళ్లలోపు పిల్లలు 11 నుంచి 14 గంటలసేపు నిద్రపోవడం ఆరోగ్యకరం.

3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు
3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 10 నుంచి 13 గంటలపాటు నిద్రపోవాలి.

6 నుంచి 13 పిల్లలు
6 నుంచి 13 ఏళ్ల వయసు పిల్లలు 9 నుంచి 11 గంటలసేపు నిద్రపోవడం వాళ్ల ఆరోగ్యానికి మంచిది.

14 నుంచి 17 ఏళ్లలోపు టీనేజర్స్
14 నుంచి 17 ఏళ్లలోపు టీనేజర్స్ రోజుకి 8 నుంచి 10 గంటలపాటు నిద్రపోవాలి.

18 నుంచి 25 ఏళ్ల వయసు
18 నుంచి 25 ఏళ్ల వయసు మధ్యలో ఉండేవాళ్లకు 7 నుంచి 9 గంటల నిద్ర సరిపోతుంది.

26 నుంచి 64 ఏళ్ల వయసువాళ్లు
ఇక 26 నుంచి 64 ఏళ్ల వయసువాళ్లు ఇదే తరహాలో 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. 65ఏళ్లు పైబడినవాళ్లు రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోతే సరిపోతుందని స్టడీస్ సజెస్ట్ చేస్తున్నాయి.
Loading...

Popular Posts