కరివేపాకే కదా అని తీసి పారేయకండి దీనిలో అద్భుతమైన ఆరోగ్యం ఉంది.. తెలిస్తే ఇక మీరు కరివేపాకును పడేయరు గాక పడేయారు

Loading...
కూర, సాంబార్‌ వంటి వంటకాలే కాదు, పులిహోర, ఫ్రైడ్‌రైస్‌ తదితర రైస్‌ ఐటమ్స్‌ తినే సమయంలో మీరు ఒకటి గమనించారా? అదేనండి కరివేపాకు! ఆ... అయితే ఏంటి? అని కరివేపాకును కరివేపాకులా తీసి పారేయకండి. ఎందుకంటే అందులో గొప్ప ఔషధగుణాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఇక మీరు కరివేపాకును పడేయరు గాక పడేయారు. కరివేపాకును నిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలను, దాంతో దూరమయ్యే అనారోగ్య సమస్యలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
  • శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించే గుణం కరివేపాకులో ఉంది. నిత్యం 10 కరివేపాకు ఆకులను ఉదయాన్నే పరగడుపున తింటే అధిక బరువు సులభంగా తగ్గుతుంది. దీంతోపాటు డయాబెటిస్‌ సమస్య కూడా అదుపులోకి వస్తుంది. దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. 
  • కరివేపాకు, జీలకర్ర పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్య దూరమవుతుంది. ఇది నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. 
  • కమిలిన గాయాలకు, దెబ్బలకు కరివేపాకుల గుజ్జును రాస్తే అవి వెంటనే తగ్గిపోతాయి. 
  • గర్భిణీలకు తలెత్తే వికారం సమస్య తొలగిపోవాలంటే ఒక స్పూన్‌ తేనె, అర స్పూన్‌ నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకోవాలి. 
  • పుల్లటి పెరుగులో కొద్దిగా నీటిని కలిపి అందులో కరివేపాకు, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తాగితే శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది. ఇది వేసవి కాలంలో బాగా ఉపయోగపడుతుంది. 
  • కొద్దిగా కరివేపాకులను తీసుకుని వాటిని గుజ్జుగా చేసి తిన్నా, లేదా వాటి జ్యూస్‌ తాగినా డయేరియా సమస్య నుంచి బయటపడవచ్చు. 
  • కరివేపాకుల రసం, నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్‌ సమస్యలు తొలగిపోతాయి. దీనికి మజ్జిగను కలిపి ఉదయాన్నేన పరగడుపున సేవిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది. 
  • కరివేపాకుల పొడిని కూరలు, సూప్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తే దాని ద్వారా శరీరానికి కావల్సిన ఎ,బి,సి,డి,ఇ వంటి విటమిన్లు, పోషకాలు అందుతాయి.
  • ఎండిన కరివేపాకుల పొడిని కొద్దిగా హెయిర్‌ ఆయిల్‌తో కలిపి తలకు పట్టించి మసాజ్‌ చేసి కొంత సేపటి తరువాత తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. కుదుళ్లు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...