చెమట వల్ల శరీరం బాగా దుర్వాసన వస్తుంది మరి శరీరం ఫ్రెష్‌గా ఉండాలంటే కొన్ని టిప్స్‌

  • చెమట వల్ల శరీరం బాగా దుర్వాసన వస్తుంది. అందుకే శరీరం ఫ్రెష్‌గా ఉండాలంటే కొన్ని టిప్స్‌ ఉన్నాయి. అవి.... 
  • రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి పట్టుకుని ఉన్న సూక్ష్మజీవులు పోతాయి.
  • చమట ఎక్కువగా పడితే చంకల కింది భాగాన్ని యాంటి బాక్టీరియల్‌ సోప్‌, వేడినీళ్లతో రోజుకు రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి.
  • నేచురల్‌ ఫైబర్స్‌తో రూపొందించిన సిల్కు, కాటన్‌ వస్త్రాలను ధరించాలి. ఇవి తేమను బాగా పీలుస్తాయి. చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి.
  • తినే ఆహారం వల్ల కూడా శరీరం దుర్వాసన వచ్చే అవకాశం ఉంది కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో నియమాలు పాటించాలి. కెఫైన్‌, మసాలా వంటలు, ఆల్కహాల్‌, శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌, సుగర్‌, సిగరెట్స్‌, కూల్‌డ్రింక్స్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటివల్ల చంకల కింద భాగంలో దుర్వాసన వచ్చే అవకాశం ఉంది.
  • స్కిన్‌ పిహెచ్‌ వాల్యూ తక్కువగా ఉంటే దుర్వాసనకు కారణమైన బాక్టీరియా చర్మంపై ఉండదు. యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌, టీ ట్రీ ఆయిల్‌ రెండూ చర్మం యొక్క పిహెచ్‌ వాల్యూని బాగా తగ్గిస్తాయి. కొద్దిగా యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ తీసుకుని అందులో కాటన్‌ బాల్‌గాని లేదా మెత్తటి గుడ్డగాని ముంచి దానితో చంకల కింద భాగం తుడిచేసుకుంటే అక్కడ ఎంతో శుభ్రంగా ఉంటుంది. దుర్వాసన రాదు. ఎలాంటి డియోడరెంట్లను వాడాల్సిన పని కూడా లేదు.
  • నిమ్మకాయ కూడా బాక్టీరియాను చంపేస్తుంది. అందుకే నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు చెక్కలుగా కోసి ఒక చెక్కతో చంకల కింది భాగంలో రుద్దాలి. ఇలా చేయడం వల్ల నిమ్మరసం చర్మానికి అతుక్కుంటుంది. పొడారిపోయే వరకూ దాన్ని అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీళ్లతో ఆ ప్రాంతంలో కడిగేసుకోవాలి. దుర్వాసన పోయే వరకూ రోజుకు ఒకసారి ఇలా చేస్తుండాలి.
  • తులసి, వేపలలో యాంటిబాక్టీరియల్‌ గుణాలు బాగా ఉంటాయి. కొన్ని తులసి, వేప ఆకులు తీసుకుని వాటిని పేస్టులా చేయాలి. ఆ పేస్టును స్నానానికి వెళ్లే ముందర చంకల కింద భాగంలో రాసుకుని కొద్దిసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మంచి ఫలితాన్ని చూస్తారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)