రకరకాల కారణాలతో బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా ? అయితే ఈ అలవాటు అత్యంత ప్రమాదకరం

చాలామంది ఉదయాన్నే ఆఫీసులకు, స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లేవారంతా బిజీబిజీగా ఉండటoతో రకరకాల కారణాలతో సరిగ్గా టిఫీన్ చేయరు. అదేవిధంగా ఇంట్లో ఉండే స్త్రీలు అయితే ఇంట్లోనే ఉన్నాం కదా ఆకలి వేయడం లేదని బ్రేక్ ఫాస్ట్ మానేస్తారు. ఇలా ప్రతి ఇంటిలో సర్వ సాధారణంకనిపించే విషయాలే ఇవి . అయితే ఈ అలవాటు అత్యంత ప్రమాదకరం అని పరిశోధనలు చెపుతున్నాయి.
ఇలా ఎక్కువకాలం కొనసాగితే ఎసిడిటీ వచ్చే అవకాశంఉంది. టిఫిన్ తినకపోతే రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్ధాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.. ఇది దీర్ఘకాలం కొనసాగితే టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. సమయానికి ఇంట్లో ఆహారం తినకపోవడం వల్ల బయటి ఆహారం మీద మనసు పోతూ ఉంటుంది.
అలా బయట తిండికి అలవాటు పడితే బరువు పెరిగే ప్రమాదం ఉంది అని పరిశోధనలు చెపుతున్నాయి. ఇక బ్రేక్ ఫాస్ట్ తినడం తినకపోవడం పై జరిగిన పరిశోధనలలో అనేక ఆ సక్తికర విషయాలు బయట పడ్డాయి. ముఖ్యంగా పిల్లలు, ఉద్యోగులపై ఈ అధ్యయనం జరిగింది.
9 -11 సంవత్సరాల వయసుగల వారిలో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయని వారు బ్రేక్ ఫాస్ట్ చేసిన వారికంటే ఆటల్లో చదువులలో వెనుకబడి ఉన్నారని అధ్యయనాలు చెపుతున్నాయి. అలాగే ఉదయాన్నే అల్పాహారం తీసుకోని ఉద్యోగస్తులను, తీసుకున్న వారితో పోలిస్తే పనిమీద ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడ అధ్యయనాలు చెపుతున్నాయి. అందువల్ల బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఎటువంటి అస్రద్ధతో ఉండటం మంచిది కాదు అని వైద్యులు కూడ చెపుతున్నారు. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని మనం కూడ బ్రేక్ ఫాస్ట్ విషయంలో తగు జాగ్రత్తతో ఉంటే మంచిది..

Popular Posts

Latest Posts