దేవునికి హారతి ఇవ్వటం దానిని మనం కళ్ళకు అద్దుకోవటం లో ఉన్న అద్భుతమైన సైన్స్ ఇదే

దేవాలయం, పూజ గది, ఇంటిలో శుభకార్యాల సమయంలోను, పుట్టినరోజు వేడుకల్లోనూ మరియు కొత్త పెళ్లికూతురు గృహ ప్రవేశం చేసిన సమయంలోను హారతి ఇవ్వటం మనం చూస్తూనే ఉంటాం.

ఎక్కడ హారతి ఇచ్చిన ఆరోగ్య సూత్రం మాత్రం ఒక్కటే. ఇంటిలో శుభకార్యం జరిగినప్పుడు బంధువులు చాలా మంది వస్తారు. అలాగే దేవాలయంలోకి కూడా భక్తులు చాలా మంది వస్తారు. దాంతో ఆ పరిసరాల్లోని గాలి కలుషితం అవటమే కాకుండా అనేక క్రిములు చేరతాయి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వటం వలన ఆ క్రిములు అన్ని నశిస్తాయి.

అంతేకాక ముక్కుకు సంబందించిన వ్యాధులు మరియు అంటూ వ్యాధులు ప్రబలకుండా ఉంటుంది. హారతి కళ్ళకు అద్దుకుంటే కర్పూరం ఎలా క్షిణిస్తుందో అదే విధంగా మనం తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా అలానే క్షిణిస్తాయని ఒక నమ్మకం. ఇది హారతి వెలిగించటంలోను మరియు 
కళ్ళకు అద్దుకోవటంలోను ఉన్న పరమార్ధం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)