గోంగూర వండటానికి ఎట్టిపరిస్థితిలో అల్యూమినియం పాత్రలను మాత్రం ఉపయోగించకూడదు

గోంగూరని తరచుగా ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మలబద్దకం, కొవ్వు, నిస్సత్తువ వంటి అనేక సమస్యలను తగ్గించటంలో గోంగూర సహాయపడుతుంది.

  • గోంగూరలో ఉండే పీచు శరీరంలో కొవ్వును తగ్గించి గుండెకు మేలు చేస్తుంది.
  • ఈ ఆకులో పొటాషియం, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండుట వలన ఒత్తిడిని నియంత్రించటంలో సహాయపడుతుంది. అంతేకాక రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేసి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
  • విటమిన్ ఏ అధికంగా ఉండుట వలన కంటి చూపును మెరుగుపర్చటమే కాకుండా రేచీకటి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
  • ఈ ఆకును తరచుగా తీసుకుంటే రక్త కణాల వృద్ధి జరిగి రక్తహీనత అదుపులో ఉంటుంది. అంతేకాక శరీరంలో అన్ని శరీర భాగాలకు ఆక్సిజన్ బాగా సరఫరా అవుతుంది.
  • నీరసం, నిస్సత్తువ ఉన్న సమయంలో గోంగూరను కూర లేదా పచ్చడి రూపంలో తీసుకుంటే తక్షణ శక్తి వస్తుంది.
  • గోంగూరను తరచుగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన మధుమేహ రోగులకు కూడా మంచిది.
  • అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే గోంగూర వండటానికి అల్యూమినియం పాత్రలను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. లోహం ఎక్కువగా మరి స్లో పాయిజన్ గా మారుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)