అతిగా చెమట పడుతుందా ? మీరు తీసుకునే ఆహారంలో ఈ మార్పులు చేయండి చాలు సమస్యనుండి బయటపడతారు

  • చెమట పడితే శరీరానికి మంచిదే. వ్యర్థాలు ఆ రూపంలో బయటకు వెళ్లిపోతాయి. కానీ కొంతమందికి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటి వారు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి దూరం కావొచ్చు. అవేంటంటే...
  • శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోయే వాళ్లలో చెమట సమస్య అధికంగా ఉంటుంది. మంచి నీళ్లు బాగా తాగడం, తేలికపాటి పోషకాహారం తీసుకోవడం, తినే ఆహారంలో 'బి' విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. అరటి పండ్లు, గుడ్లు, గింజలు, ఆకుపచ్చని ఆకుకూరలు ఈ జాబితాలో వస్తాయి.
  • శరీర దుర్వాసనను తగ్గించాలంటే విటమిన్‌ 'సి' ఎక్కువగా ఉండే పండ్లు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. క్యాల్షియం, మెగ్నీషియం కలిసి ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. అందుకోసం పాలు, క్యారెట్‌, ఆకుకూరలు, చేపలు, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి.
  • జింక్‌ తగినంతగా ఉంటే నోటి, శరీర దుర్వాసనలు తొలగిపోవడంతో పాటు శరీరం చురుగ్గా పనిచేసేట్టు చేస్తుంది. వేయించిన గుమ్మడి గింజల్లో, ఎండిన పుచ్చకాయ గింజల్లో జింక్‌ ఎక్కువగా దొరుకుతుంది. పది గ్రాముల గుమ్మడి గింజలని తింటే వాటి నుంచి రోజువారీ అవసరాలకు కావల్సిన జింక్‌లో డెబ్బై శాతం లభిస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)