మధ్యాహ్నం ఎంతసేపు నిద్రపోవాలో, ఎన్ని నిమిషాలు పడుకుంటే ఎలాంటి లాభాలుంటాయో తెలుసా ?

Loading...
మధ్యాహ్నం నిద్రపోవడం చాలామందికి ఉండే అలవాటు. ఇది ఓ పద్ధతిలో ఉంటే చాలా మంచి అలవాటు కూడా. మధ్యాహ్నం పనులు లేకపోతే భేషుగ్గా కాసేపు కనుకు తీయవచ్చు. అయితే ఎంతసేపు నిద్రపోవాలో, ఎన్ని నిమిషాలు పడుకుంటే ఎలాంటి లాభాలుంటాయో తెలుసా ? 
  • మధ్యాహ్నం గంటన్నరకి ఎక్కువ పడుకోకూడదు అని అంటారు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఒకటి రాత్రి నిద్రపట్టడం కష్టమైపోతుంది. లేదంటే అతినిద్ర వలన అధికబరువు, డయాబెటిస్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. అదే గంటన్నరపాటు నిద్రపోతే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. 
  • రిఫ్రెష్ మెంట్ కోసం ఓ గంట నిద్ర చాలు అని అంటారు. మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది గంటసేపు నిద్ర తరువాత.
  • అరగంట నిద్ర అలసటను దూరం చేస్తుంది. రాత్రి నిద్రపట్టకపోతే, వర్క్ ప్రెషర్ మధ్యలో ఉంటే, అరగంట నిద్ర బాగా ఉపయోగకరం.
  • ఇరవై నిమిషాల నిద్ర ఎనెర్జెటిక్ గా ఫీల్ అయ్యేలా చేస్తుందని పరిశోధకులు చెబుతారు. ఆఫీసు లంచ్ బ్రేక్ లో ఈ నిద్ర పనికివస్తుంది.
  • రోజంతా పని ఉంటే, మధ్యమధ్యలో పదినిమిషాలు నిద్రపోవడం చాలా మంచిది. ఏకధాటిగా పనిచేస్తే ఏకాగ్రత దెబ్బతినవచ్చు. అలాంటప్పడు ఇలా బ్రేక్స్ ఇస్తూ పది నిమిషాల కునుకు తీయడం మంచిది.
Loading...

Popular Posts