ఎలా పడుకుంటాం.. ఎటువైపు తిరిగి పడుకుంటాం…అనే విషయంపై కూడా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది

Loading...
ఎడమ వైపు తిరిగి పడుకుంటున్నారా… అని అడుగుతున్నారు ఏంటి, నిద్ర పోవడం ముఖ్యంకానీ ఎటువైపు తిరిగి పడుకుంటే ఏంటి అని అనుకుంటున్నారు కదూ. కారణం ఉందండీ. 

మనం ఎటువైపు తిరిగి పడుకుంటాం… అనే విషయంపై కూడా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది. చక్కటి ఆరోగ్యానికి, డీప్ స్లీప్ రావడానికి ఎడమ వైపు తిరిగి పడుకుంటేనే మంచిదని పరిశోధనల్లో తేలింది. ఎడమ వైపు తిరిగి పడుకునే వారిలో 60% మంది ఉదయం లేచిన తర్వాత సంతోషంగా, ఉల్లాసంగా ఉంటున్నారని… కుడివైపు తిరిగి పడుకునేవారిలో నిద్రలేమి, అశాంతి వంటివి చోటుచేసుకుంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. వారి పరిశోధనల్లో తేలిన మరిన్ని నిజాలు….

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల తిన్న ఆహారం ఎక్కువ సేపు పొట్టలో నిల్వ ఉండకుండా త్వరగా జీర్ణం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఎడమవైపు నిద్ర పోవడం వల్ల చిన్న ప్రేగుల నుండి పెద్దప్రేవుల్లోకి గ్రావిటి ద్వారా వేస్ట్ ప్రోడక్ట్ లు నెట్టబడతాయి.

ఎడమ వైపు నిద్రించడం వల్ల శరీరభాగాలన్నింటికి బ్లడ్ సర్కులేషన్ సరిగా జరుగుతుంది. తద్వారా గుండె మీద పనిభారం తగ్గుతుంది.
ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల క్రమేపి గ్యాస్టిక్, ఎసిడిటి మరియు హార్ట్ బర్న్ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
బ్యాక్ పెయిన్ తో బాధపడే వారు ఎడమవైపు పడుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
Loading...

Popular Posts