పెదవులు నల్లగా మారకుండా ఉండాలంటే.. పెదవుల ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించండి

Loading...
శీతాకాలంలోనే పెదాలు పగుల్తాయనుకుంటే పొరపాటే. పెదవులపైన చర్మం పొరలుగా వచ్చేయడం, పగుళ్లు ఏర్పడటం ఎండాకాలంలో కూడా కనిపిస్తుంది. పెదవుల పగుళ్లను పట్టించుకోకపోతే పెదవులు నల్లగా మారే అవకాశం కూడా ఉందని బ్యూటీషన్లు అంటున్నారు. అందుకే పెదవుల ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించండి...
  • పెదవులపై ఆలివ్‌ ఆయిల్‌ని రోజుకు రెండుసార్లు రాసుకోవడం మరిచిపోకండి. 
  • వేసవిలో పెదాల పగుళ్లను నివారించాలంటే.. సగం నిమ్మకాయ ముక్కపై పంచదార అద్ది పెదవులపై గుండ్రంగా రుద్దాలి. ఇలా పది నిమిషాల పాటు చేసి చల్లని నీటితో కడిగేస్తే పెదవుల తేమ పోకుండా ఉంటుంది.
  • కొబ్బరి నూనెలో రెండు మూడు స్పూన్ల నిమ్మరసం వేసి పెదవులకు రాస్తే మంచి ఫలితం ఉంటుంది. 
  • రోజూ పెదవులకు తేనె రాసుకుంటే చర్మం తేమను కోల్పోదు.
  • రోజూ రెండు సార్లు మీగడ రాసుకున్నా పెదవులు మృదువుగా తయారవుతాయి.
  • పగిలిన పెదవులకు ఇన్‌ఫెక్షన్‌ రాకుండా కూడా తేనె నివారిస్తుంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...