జుట్టు రాలిపోవడం అనేది ఈ రోజుల్లో సహజమైపోయింది. జుట్టు రాలే సమస్య నుంచి బయటపడేందుకు పరిష్కార మార్గాలు

జుట్టు రాలిపోవడం అనేది ఈ రోజుల్లో సహజమైపోయింది. పెరుగుతున్న కాలుష్యం, మారిపోయిన ఆహారపు అలవాట్ల వల్ల పురుషుల్లో ఇదొక ప్రధాన సమస్యగా పరిణమించింది. అయితే మధ్య వయస్కులకు జుట్టు రాలిపోవడం సహజం. అయితే ఈ రోజుల్లో 20 సంవత్సరాలు నిండిన చాలా మంది యువకులు ఈ సమస్యతో బాధపడుతుండడం ఆందోళన కలిగించే విషయం. మానసిక ఒత్తిడులు, హార్మోన్ల వృద్ధిలో లోపాలు, విటమిన్ల లోపం, సమయానికి తిండి లేక పోవడం, నిద్రలేమి తదితర కారణాలన్నీ జుట్టు రాలిపోవడానికి ప్రధాన హేతువులు. ఈ జుట్టు రాలే సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు వైద్యులు.

ప్రొటీన్ల లోపం వల్ల కూడా జుట్టు రాలుతుండొచ్చు. మాంసకృతుల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కనుక ఎక్కువగా మాంసాహారాన్ని తినేందుకు ప్రయత్నిస్తే మంచిది.

విటమిన్లు లోపించడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. అందువల్ల విటమిన్లను ఆహార రూపంలో కానీ, క్యాప్స్యూల్స్ రూపంలో గానీ తీసుకునేందుకు ప్రయత్నించండి.

కొంతమంది జుట్టుకు ఎలాంటి నూనెను పెట్టకుండా అశ్రద్ధ చేస్తుంటారు. జుట్టు పొడిగా తయారవడం వల్ల బలహీనపడి రాలిపోయే అవకాశముంది. కనీసం రెండు రోజులకు ఒకసారైనా నూనెను పెడితే మంచిది.

ఫ్యాషన్ పేరుతో యువత జుట్టుకు రకరకాల కలర్స్‌ను అప్లై చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు సహజత్వాన్ని కోల్పోయి బలహీనపడుతుంది. అందువల్ల రంగులను వీలైనంత తక్కువగా వాడితే బెటర్.

కొంతమంది జుట్టుకు రకరకాల షాంపూలను వాడుతుంటారు. ఇది అన్నింటి కన్నా ప్రమాదకరం. ఒకే రకమైన షాంపూలను జుట్టుకు వాడాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)