పొట్ట పెరగకుండా ఉండాలంటే ? ఈ జాగ్రత్తలు తీసుకుంటే పొట్ట మీ వైపు కన్నెత్తి కూడా చూడదు

సహజంగా ఈ రోజుల్లో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువసేపు కంప్యుటర్ ముందు కూర్చొని పని చేయడం వల్ల సహజంగా పొట్ట పెరిగిపోతుంది. దీని వల్ల ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఫలితంగా ఎన్నో రోగాల బారిన పడాల్సి వస్తోంది. అయితే ఇందులో ఎక్కువగా యువత ఉండడం కూడా ఆందోళన కలిగించే విషయం. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే పొట్ట పెరగకుండా చెక్ పెట్టొచ్చని నిపుణులు అబిప్రాయపడుతున్నారు.
  • రోజులో కనీసం అర్థ గంటైనా వ్యాయామానికి కేటాయించండి. లేదా రోజూ పొద్దున్నే లేచి నడవండి లేదా యోగా లాంటివి చేయండి.
  • రోజూ మనం ఎంత ఆహారాన్ని తీసుకుంటున్నాము అందులో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కొవ్వుగా పెరుకుపోతుందో గమనిస్తూ ఉండాలి.
  • బజారు జంక్ ఫుడ్ తినడం పూర్తిగా మానివేసి ఇంట్లో ఆహారాన్ని క్రొవ్వు పదార్థాలు లేని పీచు పదార్థాలను ఆహారంగా ఎక్కువగా తీసుకోవాలి.
  • పొట్ట రావడం, రాకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పొట్ట మీ వైపు కన్నెత్తి కూడా చూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
  • ప్లేటు పరిమాణం మీద దృష్టి పెట్టండి. పెద్ద ప్లేటులో తిన్నప్పుడు కాస్త గట్టిగానే లాగిస్తాం. అలాకాకుండా తక్కువ, ఎక్కువ కానీ ప్లేట్‌ను ఎంచుకోవడం మంచిది.
  • బాగా రాత్రి టైం భోజనం చేయవద్దు. మరీ ఆకలిగా ఉంటే పండ్లుగానీ, స్నాక్స్‌గానీ తినడం మంచిది.
  • భోజనం చేసిన సమయానికి బెడ్ మీద చేరే సమయానికి కనీసం మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
  • ఎమోషనల్ ఈటింగ్‌కు దూరంగా ఉండండి. కొందరు విచారంలో ఉన్నప్పుడుగానీ, సంతోషంలో ఉన్నప్పుడు కానీ, కోపంగా ఉన్నప్పుడు గానీ సాధారణం కంటే చాలా ఎక్కువగా తింటారు. దీన్నే ఎమోషనల్ ఈటింగ్ అంటారు. దీనికి దూరంగా ఉండటం మంచిది.
  • భావోద్వేగాలకు గురైనప్పుడు వెంటనే గ్లాసు నీళ్లు తాగండి. కొద్దిసేపు నడవండి.
  • ఫ్యాట్‌ఫుడ్స్, లో-ఫ్యాట్ ఫుడ్స్‌పై అవగాహన పెంచుకుని, నిద్రలేమి, తక్కువ నిద్రపోవడం లాంటి సమస్యల వల్ల కూడా పొట్ట పెరుగుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)