తేనే జీలకర్ర నీళ్లు పరగడుపున తాగితే ఇక మీ శరీరంలోకి ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి తయారీ విధానం చాలా సులువు

కావాల్సిన పదార్థాలు 
జీలకర్ర - 2 టీ స్పూన్లు 
తేనె - 2 టీ స్పూన్లూ 
నీళ్లు - 1 కప్పు
తయారు చేసే విధానం 
ఒక కప్పు నీటిని బాగా వేడి చేయాలి. మరుగుతున్న నీటిలో జీలకర్ర వేయాలి. 10 నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత.. ఆ నీటిని వడకట్టుకోవాలి. ఇప్పుడు జీరా వాటర్ లో తేనె కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తాగవచ్చు.
  • ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల బ్లడ్ లో పేరుకున్న మలినాలను యూరిన్ ద్వారా బయటకుపంపవచ్చు. దీనివల్ల ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.
  • జీరా వాటర్, తేనె కలిపిన మిశ్రమం... జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. హెల్తీ డైజెస్టివ్ జ్యూస్ ని ఉత్పత్తి చేసి.. అనేక రకాల జీర్ణసంబంధ సమస్యలను దూరంగా ఉంచుతుంది. 
  • జీరా, తేనె కాంబినేషన్ మలబద్దకం నివారించడానికి ఎఫెక్టివ్ రెమిడీ. కాబట్టి మలబద్దకం తో బాధపడేవాళ్లు.. ఈ మిశ్రమాన్ని తాగితే.. ఆ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు. 
  • జీరాలో క్యుమినల్ డిహైడ్ ఉంటుంది. ఇది.. క్యాన్సర్ కణాలు పెరగకుండా, శరీరంలో ఏర్పడకుండా అడ్డుకుంటుంది. 
  • జీరా వాటర్, తేనె మిశ్రమంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది.. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది. 
  • ఈ న్యాచురల్ డ్రింక్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి. ఇది.. శ్వాస సంబంధ సమస్యలను నివారించి.. ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంది. 
  • జీరా వాటర్, తేనె మిశ్రమంలో.. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ మిశ్రమం ఐరన్ శాతాన్ని పెంచుతుంది. దీనివల్ల అనీమియాను నివారించవచ్చు.

Popular Posts

Latest Posts