ఎటువంటి వార్నింగ్ లేకుండా సడన్ గా ప్రాణం తీసే 7 రోగాలు

  • హైబ్లడ్ ప్రెజర్ : హైబ్లడ్ ప్రెజర్ ను హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తారు. హైబ్లడ్ ప్రెజర్ 141.0/90. 70మిలియన్ల అమెరికన్ అడల్ట్స్ లో ప్రతి ముగ్గురిలో ఒకరు హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లు సెంటర్ ఆఫ్ డిసీజెస్ కంట్రోల్ కనుగొన్నారు . హైబ్లడ్ ప్రెజర్ స్ట్రెస్, ఎక్కువగా ఉప్పు తినడం, ఆందోళన, ఎక్కువగా మద్యం తాగడం, ఒత్తిడితో కూడిన జీవనశైలి వల్ల రావచ్చు. వీటి వల్ల ఓబేసిటిన జెనటిక్ ఫ్యాక్టర్స్, బర్త్ కంట్రోల్ పిల్స్, కిడ్నీ వ్యాధులు, అడ్రినల్ డిసీజ్ . హైబ్లడ్ ప్రెజర్ వ్యాధి యొక్క లక్షణాలు సాధరణంగా గుర్తించలేము.అయితే కొన్ని మాత్రం తలనొప్పి, శ్వాసలో ఇబ్బందులు, ముక్కులో రక్తం కారడం. హబిపి కేవలం డాక్టర్లు లేదా ఇంట్లో రెగ్యులర్ టెస్ట్ చేసుకోవడం వల్ల మాత్రమే గుర్తించుకోవచ్చు . దాంతో వెంటనే చికిత్స తీసుకుని కంట్రోల్ చేసుకోవడం వల్ల హార్ట్ డిసీజ్, హార్ట్ స్ట్రోక్ తో ప్రాణహాని కలగకుండా నివారించుకోవచ్చు.
  • డయాబెటిస్: డయాబెటిస్ లో రెండు రకాలున్నాయి. వాటిలో టైప్ 1 మరియు టైట్ 2 డయాబెటిస్ . టైప్ 1 డయాబెటిస్ శరీరంలో ఇన్సులిన్ సరిపడా ఉత్పత్తి కాదు, టైప్ 2 శరీరంలో ఇన్ఫులిన్ తగినంత ఉత్పత్తి కాదు మరియు ఉత్పత్తి అయిన దాన్ని సరిగా ఉపయోగించుకోలేందు.ప్రపంచ వ్యాప్తంగా 387మిలియన్ల మంది డయాబెటిక్ పేషంట్స్ ఉన్నారు. డాయాబెటిస్ ను కూడా సైలెంట్ కిల్లర్ గా సూచిస్తారు . దీనికి కొన్ని సాధారణ లక్షణాలు, ఆకలి, బరువు తగ్గడం, ఫ్రీక్వెంట్ యూరినేషన్, టయర్డ్ నెస్,గాయాలు త్వరగా మానకపోవడం, బ్లర్ విజన్ .అదనంగా జెనటిక్స్ , ఓబేసిటి, పూర్ డైట్ , వ్యాయామ లోపం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ . డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోకపోతే ఇతర సీరియస్ హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. 
  • కరోనరీ ఆర్టరీ డిసీజ్: ఇది ఒక సాధారణ హార్ట్ డిసీజ్ . ధమనుల గోడలకు అనుకుని ప్లాక్(పాచి)పెరుగుతుంది. ఎక్కువ పెరగడం వల్ల కొద్దిగా లేదా పూర్తిగా రక్తప్రసరణను అడ్డుకుంటుంది. ధమనులు బ్లాక్ అవుతాయి. ఇలా కొద్ది రోజుల అలాగే ఉంటే హార్ట్ మజిల్స్ వీక్ గా మారుతాయి , హార్ట్ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్ కు రిస్క్ ఫ్యాక్టర్ ఓబేసిటి, ఫ్యామిలీ హిస్టర్, పూర్ డైట్, స్మోకింగ్, వ్యాయామ లోపం. ఈ వ్యాది యొక్క లక్షణాలు వెంటనే ఎలాంటి లక్షణాలు చూపదు. లక్షణాలు బయటకు కనపడవు . కాబట్టి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అవసరం.లోసోడియం, లోఫ్యాట్ ఫుడ్స్, తినాలి. . రెగ్యులర్ గా వ్యాయామం, మెడికేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి.
  • ఫ్యాటీ లివర్ డిసీజ్ : కాలేయంలో కొవ్వు కణాలను బ్రేక్ చేయకుండా ఉండటం వల్ల లివర్ టిష్యులు ఏర్పడుతాయి. ఫ్యాటీలివర్ డిసీజ్ లో రెండు రాకాలున్నాయి. అందులో ఒకటి ఆల్కహాలిక్ మరియు నాన్ ఆల్కహాలిక్ డిసీజ్ . ఆల్కహాల్ డిసీజ్ ఎక్కువగా తీసుకోవడం ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏర్పడుతుంది. నాన్ ఆల్కహాలిక్ డిసీజ్ కు కారణాలు తెయదు . ఫ్యాటీ లివర్ డిసీజ్ కు ప్రాణానికి తీవ్రంగా హని జరిగితే తప్ప ఎలాంటి నోటీసబుల్ లక్షణాలు కనిపించవు . అయితే వ్యాధిలక్షనాలు అంతర్గతంగా తీవ్రమైనప్పుడు బయటకు కనిపించే లక్షణం వాపు. ఇది మరింత ప్రమాద స్థితికి చేర్చుతుంది. దీనికి గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయాల్సిం ఉంటుంది.
  • కీళ్ళ నొప్పులు: కీళ్ళ నొప్పులు ఎముకలకు చాలా హాని కలిగిస్తుంది. శరీరంలో ఎముకలు పెళుసుగా మారడం లేదా విరిగిపోవడం జరుగుతుంది. మనకు బయటకు కనబడని ఈ లక్షణాలను బట్టే ఇది సైలెంట్ కిల్లర్ డిసీజ్ గా సూచిస్తున్నారు. ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనబడకపోవడం వల్ల చికిత్సను చేయించుకోలేరు. ఈ వ్యాధి ఏవయస్సు వారికైనా వస్తుంది. అయితే వ్యాధి తీవ్రమైనప్పుడు నొప్పితో బోన్ ఫ్రాక్చర్ జరుగుతుంది. బ్యాక్ పెయిన్, బోన్ ఫ్రాక్చర్ మైనర్ కట్స్ ఏర్పడుతాయి. ఈ వ్యాధి ఉన్నప్పుడు డాక్టర్ ను కలిసి బోన్ మినిరల్ డెంసిటి టెస్ట్ చేయించి చికిత్స తీసుకోవడం వల్ల కీళ్ళ వ్యాధులను ినవారించుకోవచ్చు,. ప్రమాద స్థితికి కారణం ఫ్యామిలి హిస్టరీ, పూర్ డైట్, వ్యాయామ లోపం, స్మోకింగ్, మందులు.
  • కోలన్ క్యాన్సర్: కోలన్ క్యాన్సర్ కూడా సైలెంట్ కిల్లర్ . ప్రతి సంత్సరం ఈ వ్యాధికి కొన్ని వేల సంఖ్యలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. కోలన్ లో ట్యూమర్ ఏర్పడం వల్ల ప్రాణాపాయ స్థితికి చేర్చుతుంది. ఇది రాత్రికి రాత్రి జరిగే మార్పు .చిన్న కణాలుగా ఏర్పడి పెద్దగా పెరుగుతాయి. అయితే ఇవి నాన్ క్యాన్సేరియస్ కణాలు గా పెరుగుతాయి. కానీ దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కొంత మందిలో క్యాన్సర్ కు తిరుక్కుంటుంది. కాబట్టి ప్రారంభంలో కనుగొని వెంటనే చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కోలన్ క్యాన్సర్ వెంటనే లక్షణాలను చూపించదు, కానీ, నిధానంగా మలబద్దకం, డయోరియా, మోషన్ లో బ్లడ్ , గ్యాస్ట్రిక్, పొట్ట ఉదరంలో నొప్పి, లోబ్లడ్ కౌంట్, బరువు తగ్గడం, వాంతులు, అలసట వంటి లక్షణాలు వ్యాధి ముదిరిన తర్వాత కనిపిస్తాయి.
  • హెపటైటిస్ : హెపటైటిస్ ను లివర్ ఇన్ఫ్లమేటరీ కండీషన్ గా గుర్తిస్తారు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ప్రపంచ మొత్తంలో కొన్ని వేల సంఖ్యంలో ఈ వ్యాధితో బాధపడుతున్నారుజ హెపటోట్రోపిక్ వైరస్ హెపటైటిస్ ఎ, బి, సి, డి మరియు ఇ తో పాటు వివిధ రకాల వ్యాధులకు కారణమవుతుంది. హెపటైటిస్ ఎ మరియు ఇలు మనం తీసుకునే ఆహారాలు, మరియు తాగే నీరు వల్ల వస్తుంది. హెపటైటిస్ బి, సి, మరియు డిలు బ్లడ్ , సెక్స్యువల్ కాంటాక్ట్ మరియు చైల్డ్ బర్త్ సమయంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇది ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా వస్తుంది. దీన్ని ఆటోఇమ్యూన్ డిసీజ్ గా సూచిస్తారు. ఇది శరీరంలో కొన్ని సంవత్సరాల పాటు తిష్టవేసుంటుంది కానీ ఎలాంటి లక్షణాలు కనపించివచ్చు. వ్యాధి తీవ్రమైనప్పుడు, అలసట, మజిల్స్ పెయిన్, జాండీస్, పేల్ స్టూల్, ఫీవర్, వాంతులు, డయోరీ లక్షణాలు కనబడుతాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)