కమ్మవాడిగా పుట్టినంత మాత్రాన గొప్ప ఏముంది ? అందరిలాగే కమ్మవాళ్లూ పుట్టారు...కులం గురించి చాలా అద్భుతంగా మాట్లాడిన జగపతి బాబు

Loading...
ప్రస్తుతం మన సమాజంలో కులాల, మతాల పట్టింపులు ఏ రేంజ్ లో ఉన్నాయో మనందరికీ తెలిసిందే. టెక్నాలజీ పెరిగిపోయే కొద్దీ ఈ కుల మతాల గొడవలు తగ్గాల్సింది పోయి.. మరింతగా పెరుగుతున్నాయి. ఇక సినిమా, పాలిటిక్స్ రంగాల్లో వీటి ప్రాధాన్యమూ ఎక్కువే అన్న విమర్శలూ ఉన్నాయి. అయితే అంతా ఒకలా ఉండరు. అసలు తాను ఈ కులాలు, మతాలను ఏమాత్రం పట్టించుకోనంటున్నారు ఇటీవల స్టైలిష్ విలన్ గా మారిన ఒకనాటి హీరో జగపతిబాబు.

తనకు కుల, ప్రాంత భేదాలు లేవని.. ఉంటే ‘జై బోలో తెలంగాణ’ సినిమా చేసేవాణ్ణి కాదని... కులాలు లేని సమాజాన్ని కోరుకుంటానని జగపతి బాబు అంటున్నారు. పేర్ల వెనుక కులం పేరు తగిలించుకోవడం కూడా ఆయనకు నచ్చదట. ఇలా ప్రపంచంలో మనదేశంలో తప్ప మరే దేశంలోనూ ఉండదంటారాయన. ఒక కులాన్ని బీసీలో చేర్చాలనీ, ఇంకో కులాన్ని యస్సీ లేదా యస్టీలో చేర్చాలనే డిమాండ్లు రాజకీయపరమైనవన్నదే జగపతిబాబు ఫీలింగ్..
తాను కమ్మవాడిగా పుట్టినందుకే ఇలా మాట్లాడటం లేదంటారు జగపతిబాబు. అంతేకాదు.. కమ్మవాడిగా పుట్టినంత మాత్రాన తన గొప్పేమిటంటని మననే ప్రశ్నిస్తారు జగపతిబాబు. మిగతా అందరిలాగే కమ్మవాళ్లూ పుట్టారు... అలాంటప్పుడు కమ్మ వాళ్ల గొప్ప, ప్రత్యేకత ఏముంటాయని ప్రశ్నిస్తున్నారు జగపతిబాబు. తనకు కులం పట్టింపులేదని చెప్పేందుకు ఆయన ఇటీవల ఓ ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఇంట్రస్టింగ్ ఫ్యాష్ బ్లాక్ కూడా వినిపించారు.

కొన్నేళ్ల క్రితం విజయవాడ సిద్ధార్థ కాలేజీలో ఓ ఫంక్షనకు అతిథిగా వెళ్లారట. అక్కడ కమ్మ కులంపై మాట్లాడతానని ప్రిన్సిపాల్‌తో అంటే ఆయన వద్దే వద్దని వారించారట. ఈ కాలేజ్ లోని స్టూడెంట్స్ లో కమ్మవాళ్లదే డ్యామినేషన్ అని.. మీరు ఏదైనా మాట్లాడితే వాళ్లు రెచ్చిపోతారని హెచ్చరించారట. కానీ జగపతిబాబు ఏమాత్రం పట్టించుకోకుండా కుమ్మ కులంపైనే మాట్లాడారట.

అంతే కాదు.. మీ ప్రిన్సిపల్ ఇలా చెప్పాడని కూడా చెప్పారట.. ఇప్పుడు మీరేం చేస్తారు? నన్ను చంపుతారా? అయితే చంపండి అని ఆవేశంగా అన్నారట జగపతి బాబు.అప్పుడు స్టూడెంట్స్ ఆయన్ను మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారట. అంతేకాదు.. తనను కమ్మసంఘం వాళ్లు వనభోజనాలకు పిలుస్తుంటారని.. కానీ అట్లాంటి కుల భోజనాలకు, కుల సమావేశాలకు తాను వెళ్లనని ఏమాత్రం మోహమాటం లేకుండా చెప్పేశారు జగపతి బాబు. అసలు ఇలాంటి చూస్తుంటే ఇంకా ఏంటీ కులబేధాలు.. అసలు మనమెక్కడ ఉన్నాం.. ఇవి పోయినప్పుడే మన సమాజం బాగుపడుతుంది అంటారాయన.
Loading...

Popular Posts