బరువు తగ్గడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గించే అద్భుతమైన 3 పద్ధతులు

బరువు తగ్గేందుకు చుట్టూరా బోలెడు పద్ధతులు కనిపిస్తుంటాయి. వినిపిస్తుంటాయి. అయితే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా బరువు తగ్గిస్తే బెటర్‌ అనిపిస్తుంది కదా... అలాంటివే ఓ మూడు పద్ధతులు మీ కోసం...
  • ఒక్కటో పద్ధతి :- 
ఆర్గానిక్‌ యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌, నిమ్మరసం, తేనెలను ఒక్కో టీస్పూన్‌ చొప్పున తీసుకోవాలి. ఒక కప్పు నీళ్లలో వీటన్నింటినీ కలిపి రోజుకి మూడు సార్లు భోజనం ముందు ప్రతిసారి తాగాలి. ఈ మిశ్రమంలోని నీళ్లు హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌ జీవక్రియల్ని మెరుగుపరుస్తుంది. జీవక్రియలు సరిగా జరిగితే బరువు తగ్గిపోతుంది. నిమ్మరసం కలపడం వల్ల వెనిగర్‌ రుచి ఇబ్బందిగా అనిపించదు. మొత్తంమీద ఆర్గానిక్‌ యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌ బరువు తగ్గించేందుకు సహజసిద్ధమైన రెమెడీ. 

  • రెండో పద్ధతి :-
దోసకాయ (మీడియం సైజ్‌) - ఒకటి (ముక్కలు కోసి), 
నిమ్మరసం - అరచెక్క, 
నీళ్లు - ఒక గ్లాసు. 
ఈ మూడింటిని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా బ్లెండ్‌ చేయాలి. తరువాత వడకట్టి చిటికెడు ఉప్పు, నల్లమిరియాలు, వేగించిన జీలకర్ర పొడులు వేసి బాగా కలపాలి. ఈ డ్రింక్‌ను రోజుకి రెండు సార్లు తాగాలి.
ఈ కాంబినేషన్‌ డ్రింక్‌ బరువు తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తుందని న్యూట్రిషనిస్టులు టెస్ట్‌ చేసి మరీ చెప్తున్నారు. బరువు తగ్గించడమే కాకుండా శరీరం నుంచి వ్యర్థాలను బయటికి నెట్టేస్తుంది కూడా. ఈ డ్రింక్‌ తాగడం వల్ల జీవక్రియలు సరిగా జరిగి బరువు వేగంగా తగ్గుతుంది.
దోసకాయలో 95 శాతం నీరు ఉంటుంది. మామూలు నీళ్ల కంటే ఈ నీళ్లు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. దానివల్ల హైడ్రేటెడ్‌గా ఉండటమే కాకుండా శరీరం నుంచి వ్యర్ధాలను బయటికి పంపిస్తాయి.
  • మూడో పద్ధతి :- 
దాల్చినచెక్క పొడి - అర టీస్పూన్‌, 
వేడినీళ్లు - ఒక కప్పు
వేడి నీళ్లలో దాల్చినచెక్కపొడి వేసి అవి గోరువెచ్చగా అయ్యే వరకు మూత పెట్టి ఉంచాలి. ఆ తరువాత రుచికి సరిపడా లేదా రెండు టీస్పూన్ల తేనె కలిపి నిద్రపోయేముందు సగం కప్పు తాగాలి. మరో సగాన్ని బెడ్‌ పక్కనే ఉంచి ఉదయం నిద్ర లేవగానే పరగడుపున సగం కప్పు నీళ్లను వేడి చేయకుండా తాగాలి. ఇలా వారం రోజులు చేసి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది.
దాల్చిన చెక్క చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేస్తుంది. తేనె బరువు తగ్గించడమే కాకుండా కొవ్వు కరిగించే జీవక్రియల్ని వేగవంతం చేస్తుంది. ఒత్తిడి కలిగించే హార్మోన్ల నుంచి బయటపడేస్తుంది. అంతేకాకుండా ఈ మిశ్రమం రక్తంలో గ్లూకోజ్‌ను క్రమపరుస్తుంది. కొలెస్ర్టాల్‌ లెవల్స్‌ను కూడా. ఇది మంచి థర్మోజెనిక్‌ ఫ్యాట్‌ బర్నర్‌.
ఈ మూడు పద్ధతులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గిస్తాయి. ఈ మంచి విషయాన్ని అందరికి షేర్ చేయండి
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)