ఈ చిన్న నియమాలను పాటిస్తే పేరు ప్రతిష్ఠలతోపాటు డబ్బే డబ్బు.. !!!

Loading...
జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని అందరూ అనుకుంటారు. ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటారు. అయితే మీకు ఇష్టమైన సెలబ్రిటీ లేదా రాజకీయ నేత లేదా ఆదర్శంగా తీసుకునే వ్యక్తులు లాగా మీరూ ఉండాలని అనుకోవడం దురాశే అవుతుంది. ఎల్లప్పుడు వాస్తవంలో జీవించడానికి ప్రయత్నించండి అంతే కాకుండా చిన్న చిన్న కోరికలను, కలలను సాకారం చేసుకోడానికి ప్రయత్నించండి.

ముందు మీ పుట్టుక గురించి అవగాహన చేసుకోండి. పుట్టిన తేది, సమయం, జన్మ రాశి, కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోడానికి ప్రయత్నించండి. అలాగే ఇతరుల కంటే విభిన్నంగా ఉండటానికి కృషి చేయాలి. జీవితంలో ధనంతోపాటు కీర్తి, అదృష్టం కలిసి రావాలంటే ఈ కింది సాధారణ నియమాలు పాటించాలని పురాతన హిందూ గ్రంథాల్లో పేర్కొన్నారు. భారతీయ పండితులు పేర్కొన్న ఏడు రహస్యాలను వారంలోని ఓక్కో రోజు ఒక్కో విధంగా చేస్తే కీర్తి, సంపదలు జీవితాంతం వెన్నంటి ఉంటాయట.
  • ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు తమలపాకు నమలడం లేదా ఆకులు జేబులో ఉంచుకోవడం చేస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రతి ఆదివారం ఇలా పాటించాలి.
  • వారంలో మొదటి రోజు సోమవారంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి సానుకూలమైన ఆలోచనలతో అద్దంలో మీ ముఖాన్ని ఓ సారి చూసుకుని ఇంట్లో నుంచి బయటకు రావాలి. వీలైతే కోడిగుడ్డు ఆకారంలో ఉండే అద్దాన్ని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అమర్చుకోవాలి.
  • మంగళవారం అంటే ఆంజనేయుడికి ప్రత్యేకమైన రోజని హిందువులు నమ్ముతారు. అందుకే ప్రతి మంగళవారం ఉదయం స్నానం ఆచరించి హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి. బెల్లం తింటే మరీ మంచిది.
  • ఏదైనా ముఖ్యమైన పనిమీద బుధవారం వెళితే తప్పకుండా పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లో వేసుకోవాలి. ప్రతి బుధవారం ఇలా చేస్తే మతపరంగానూ చాలా ప్రయోజనం ఉంటుంది.
  • గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కాసింత జీలకర్ర లేదా ఆవాలు నోట్లు వేసుకోండి. వాటిని నమల కుండా అలానే నోట్లో ఉంచుకోవాలి. గుమ్మం దాటి బయటకు వెళ్లేవరకు అలాగే ఉంచాలి.
  • పవిత్రమైన లేదా ముఖ్యమైన కార్యం గురించి శుక్రవారం వెళ్లాల్సివస్తే పెరుగు తిని బయలుదేరాలని హిందూ ధర్మం బోధిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం కనీసం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు తీసుకోవాలి. ఇందులో ఉప్పు లేదా పంచదార కలపకుండా ఉంచాలి.
  • అల్లంతో కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసే ఉంటాయి. కానీ దీనివల్ల మీ దశ తిరిగి అదృష్టం యోగం కూడా ఉంటుందని తెలుసుకోండి. ప్రతి శనివారం కొద్దిగా అల్లం తురుము నేతితో కలిసి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సిరిసంపదలు మీ దరికి చేరుతాయి.
Loading...

Popular Posts