చిన్న చిన్న అలవాట్లే.. మీ అదృష్టాన్ని, ఆర్థిక పరిస్థితులను మార్చేస్తాయి.. లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే.. సాయంత్రం ఈ పనులు అస్సలు చేయకూడదు

    సాధారణంగా.. మన ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. సాయంత్రం అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని సూచిస్తూ ఉంటారు. కానీ.. కొన్ని సందర్భాల్లో వాళ్ల మాటలు పట్టించుకోకుండా.. నియమాలను నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ.. మనకు ఉన్న కొన్ని అలవాట్లు.. మనపై, మన కుటుంబంపై లక్ష్మీదేవి ఆగ్రహించేలా చేస్తాయి. హిందువుల ప్రకారం లక్ష్మీదేవిని సంతోషపెట్టినప్పుడు, మన ఇంటిని ఆమె ఆకర్షించేలా చేసినప్పుడు.. సంపద, శ్రేయస్సు ఎప్పటికీ.. మీ ఇంటిని వదిలివెళ్లదు. సంపద, శ్రేయస్సు పొందడానికి రకరకాల మార్గాలు ఉన్నాయని మన శాస్త్రాలు, హిందూ పురాణాలు చెబుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే.. ధనం మన ఇంటికి వస్తుందని చెబుతాయి. మీరు శాస్త్రాలను, పురాణాలను నమ్మేట్టు అయితే.. మీరు ఖచ్చితంగా.. కొన్ని నియమాలను పాటించాలి. మన చిన్న చిన్న అలవాట్లే.. ఆర్థిక స్తోమతపై చాలా ప్రభావం చూపుతాయి. మీకు దురదృష్టం, లక్ష్మీదేవికి ఆగ్రహం తీసుకొచ్చే అలవాట్లేంటో ఇప్పుడు చూద్దాం.. వాటికి దూరంగా ఉందాం.
  • సూర్యాస్తమయం తర్వాత.. చెత్త ఊడవడాన్ని అపవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం ... సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవడం వల్ల.. మీ సంతోషాన్ని, అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్టే అవుతుంది.
  • సాయంత్రం సమయంలో.. శారీరకంగా కలవడం, సెక్స్ లో పాల్గొనడం,  వంటి పనులు.. మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం.. సాయంత్రం సమయంలో శారీరక సంబంధం.. దురదృష్టాన్ని తీసుకొస్తుంది.
  • సూర్యాస్తమయం సమయంలో.. నిద్రపోవడం వల్ల దురదృష్టంతో పాటు, నెగటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది.
  • అలాగే సాయంత్రం పూట నిద్రపోతే.. ఒబేసిటీ, ఇతర అనారోగ్య సమస్యలకు.. కారణం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
  • తిన్న వెంటనే.. పాత్రలు శుభ్రం చేయకపోతే.. శని, చంద్రుల దుష్ప్రభావం మీ మీద పడుతుంది. అలాగే.. అన్నం తిన్నవెంటనే ప్లేట్ శుభ్రం చేయడం వల్ల.. లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద, శ్రేయస్సు పొందగలుగుతారు.
  • సూర్యాస్తమయం సమయంలో.. చదువుకోకూడదు అంటే.. కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది కానీ.. పురాణాల ప్రకారం సూర్యాస్తమయం సమయంలో.. చదువుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది.
  • సాయంత్రంపూట ఇంట్లో కూర్చుని చదువుకోవడం కంటే.. పిల్లలు బయట ఆడుకోవడం లేదా, ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం మంచిది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)