పొట్ట, నడుము, తొడలు, చుట్టూ పేరుకున్న కొవ్వు కరగాలంటే అల్లం వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది

Loading...
అల్లంను ప్రతి వంటింట్లో ఖచ్చితంగా ఉపయోగించే వస్తువు. ఇందులో ఉన్న ఔషధ గుణాలు.. అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. అయితే అనారోగ్య సమస్యలనే కాదు.. అధిక ఫ్యాట్ ని కరిగించడంలో కూడా.. అల్లం మిరాకిలస్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా పొట్ట నడుము, తొడలు, పిరుదుల భాగంలో పేరుకున్న ఫ్యాట్ ని తేలికగా కరిగిస్తుంది.  
అల్లంలో ఉండే జింజరాల్ అనే పదార్థం శరీరంలో ఉన్న అధిక నీటిని బయటకుపంపడానికి సహాయపడుతుంది. దీనివల్ల కొవ్వు కరిగిపోతుంది.
అలాగే అల్లం మెటబాలిక్ రేట్ ని శరీరంలో పెంచడానికి సహాయపడుతుంది. మెటాబాలిజం పెరిగితే.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
అల్లం వాటర్ తయారు చేసే విధానం :
ఒక లీటర్ నీటిని తీసుకుని ఉడికించాలి.
ఒక ముక్క(మీడియం సైజు) అల్లం తీసుకుని శుభ్రం చేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. మరుగుతున్న నీటిలో కలపాలి. మరో 5 నుంచి 10 నిమిషాలు అలాగే మరగబెట్టాలి . చలార్చిన తర్వాత వడపోసి ఆ నీటిని రోజంతా తాగాలి. మామూలు నీళ్లు తాగినట్టుగా తాగాలి. మూడు నాలుగు నెలలు క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ శరీరంలో కొవ్వు కరగడాన్ని గమనిస్తారు. పొట్ట, తొడలు, పిరుదులు, నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు కరుగుతూ ఉంటుంది. అల్లం వాటర్ ని ఒక కంటెయినర్ లో నిల్వ ఉంచుకోవాలి. అయితే ఏ రోజుకి ఆరోజు అల్లం వాటర్ తయారు చేసుకుని తాగడం వల్ల మెరుగైన ఫలితాలు పొందుతారు.

Loading...

Popular Posts