ఆధార్ ఉంటే చాలు, 10 రోజుల్లో పాస్ పోర్టు వస్తుంది

పాస్ పోర్టు అనేది నేటి తరంలోని విద్యార్ధులకు, ఉద్యోగస్తులకు ఎంతో అవసరం. విద్యార్థులు ఉన్నతమైన చదువులకోసం విదేశాలకు వెళ్లేందుకు, ఉద్యోగస్తులకు ఆఫీస్ పని మీద వివిధ దేశాలకు వెళ్లేందుకు వారికి ముఖ్యంగా కావలసింది పాస్ పోర్టు. వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు ఇలా ఎవ్వరికైనా మన దేశం విడిచి ఇతర దేశానికి వెళ్ళాలంటే పాస్ పోర్టు అనేది తప్పనిసరి. అయితే పాస్ పోర్టు అంత ఈజీగా రాదు. మన పేరు మీద పాస్ పోర్ట్ రావాలంటే గంటల తరబడి లైన్లల్లో, రోజుల తరబడి ఇంట్లో ఎప్పుడెప్పుడు వస్తుందా అని కాచుకుకూర్చోవాలి. మొదట పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాలి, ఆ తరువాత పోలీస్ వెరిఫికేషన్ వంటివి ఉంటాయి. అన్నీ చేసిన తరువాత కూడా పాస్ పోర్టు రావడానికి 30 నుంచి 40 రోజుల సమయం పడుతుంది. అయితే ఇప్పుడు విదేశీ మంత్రిత్వ శాఖ ఒక అద్భుతమైన అవకాశం కల్పించబోతోంది. ఆధార్ కార్డు ఉంటే చాలు, కేవలం 10 రోజుల్లో పాస్ పోర్టు మన చేతికి వస్తుంది.

ఆధార్ ద్వారా పాస్ పోర్ట్ ఎలా వస్తుందో చూద్దాం:
దరఖాస్తు దారులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేటప్పుడు గుర్తింపు మరియు చిరునామా కింద ఆధార్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాలి. కొత్త, తత్కాల్ పాస్‌పోర్టులకు దరఖాస్తు చేసుకున్న వారి పౌరసత్వం, నేర పూర్వాపరాలు, నేరారోపణలను లాంటి వాటిని పోలీసులు తర్వాత ధృవీకరించనున్నారు. ఇలా చేయడం వల్ల దరఖాస్తుదారుని గత నేర చరిత్ర ధ్రువీకరణ కోసం గుర్తింపుగా ఆధార్ కార్డును వినియోగించనున్నట్లు శాఖ అధికారులు తెలిపారు.

మూడు రోజుల్లో దరఖాస్తుదారు అపాయింట్మెంట్ పొందుతారు. మరో ఏడు రోజుల్లో పాస్‌పోర్ట్‌ని ప్రాసెస్ చేసి ఇంటికి పంపేస్తారు. పాస్ పోర్ట్ ఇంటికి చేరిన తరువాత పోలీసులు ధృవీకరణ కోసం వస్తారు. పాస్ పోర్టు విషయంలో జరుగుతున్న ఆలస్యాన్ని దృష్టిలో పెట్టుకొని, మన ప్రభుత్వం.... ఇంటిలిజెన్స్ బ్యూరో విభాగంతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపి ఆధార్ ను తప్పనిసరి చేసింది. ఈ విధానం మరొకొన్ని రోజుల్లో అమలులోకి రానుంది.

ఈ విలువైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)