వాము గురించి తెలుసుకుంటే ఇక మీ ఇంట్లో వంట్లో రోగాలే ఉండవు అంత దివ్య ఔషదం

Loading...
వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ పువ్వులనుంచే విత్తులు వస్తాయి.వాము శరీరంలో వాతాన్ని హరింపచేస్తుంది. నొప్పులను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపు ఉబ్బరం, ప్లీహవృద్ధిని తగ్గిస్తుంది. వాంతులను తగ్గిస్తుంది. గుండెకు కూడా అత్యంత ఉపయోగకారి. పసిపిల్లలకు పొట్ట ఉబ్బరంగా ఉందంటే చాలు వాము నీటిని పట్టమంటారు డాక్టర్లు. అందుకే... ఇతర నిత్యావసరాలతో పాటు... వాము మన వంటింట్లో తప్పనిసరిగా ఉండి తీరాలి. వాము ఆకలిని పెంచుతుంది.

పొట్టలోని ఇన్ఫెక్షన్ కు ఔషధంలా పనిచేస్తుంది. వారానికోసారి కొద్దిగా వామును నేరుగానైనా లేదా పొడిచేసుకుని పొడిచేసుకుని అన్నంతోపాటు తిన్నా సరే.. గ్యాస్ సంబంధ సమస్యలను దూరం చేయవచ్చు, అజీర్తి దరిచేరదు. వామును మజ్జిగతోనూ కలిపి తీసుకోవచ్చు. డాక్టర్లు చెప్పిన ప్రకారం వాము, బెల్లం కలిపి తీసుకుంటే శ్వాససంబంధ సమస్యలు ఉండవు. తరచూ కాళ్ళు, చేతుల నొప్పులు వేదిస్తుంటే వాము నూనెను మర్ధనా చేసుకుని చూడండి. ఉపశమనం లభిస్తుంది.
 • వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.
 • వాము, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.
 • వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి.
 • వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయలతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి.
 • వాత వ్యాధులు తగ్గించే శక్తి వాముకి ఉంది. వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి.
 • మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. 
 • ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి.
 • ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
 • వాము నూనె కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కాలిన గాయాలకు ఇది ఎంతో మంచిది. 
 • పంటినొప్పికి వామును గోరువెచ్చని నీటితో నమిలి పుక్కిలించి చూడండి. 
 • దగ్గు వచ్చినపుడు వేడినీటిలో కొద్దిగా వాము తీసుకుని నమలాలి. 
 • వాముకు తమలపాకు కలిపి రాత్రిపూట నమిలితే రాత్రి పొడిదగ్గు రాదు.వాము, వెనిగార్‌ లేక తేనెతో కలిపి వారం తీసుకుంటే కిడ్నీలో వున్న రాళ్లు యూరిన్‌ ద్వారా వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది.
 • ఒక గుప్పెడు వామును కచ్చాపచ్చాగా దంచి ఒక కాటన్ దస్తీలో మూటకట్టండి. దీనిని పిల్లలు పడుకునే దిండు పక్కను వుంచండి. దీని నుంచి వచ్చే ఘాటు వాసనకు పసి పిల్లల్లో ముక్కుదిబ్బడ తొలగిపోతుంది.
 • అర లీటర్ మరిగే నీళ్లకు ఒక టీ స్పూన్ వాము చూర్ణాన్ని, ఒక టీ స్పూన్ పసుపు చూర్ణాన్ని కలిపి చల్లార్చండి. దీనిని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా, ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే, జలుబు ఛాతిలో కఫం పేరుకుపోవటం వంటి సమస్యలు తగ్గుతాయి.
 • అర టీ స్పూన్ వామును, రెండు లవంగాలను, ఒక చిటికెడు ఉప్పును కలిపి చూర్ణించి అరకప్పు వేడి నీళ్లకు కలిపి కొద్దికొద్దిగా సిప్ చేస్తూ తాగితే దగ్గు తగ్గుతుంది.
 • రెండు టీ స్పూన్ల వామును మెత్తగా దంచండి. ఒక గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకుంటే కఫం పల్చబడి ఊపిరితిత్తుల్లోకి గాలిని చేరవేసే మార్గాలు శుభ్రపడతాయి.
 • వాము చూర్ణాన్ని రెండునుంచి మూడు గ్రాములు వేడి నీళ్లలో గాని లేదా వేడి పాలతో గాని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే జలుబు, తలనొప్పి, పడిశము వంటివి తగ్గుతాయి.
Loading...

Popular Posts