మన శరీరంలోని ప్రతీ అవయవము ఎంత అద్భుతమో తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు.

మన శరీరంలోని అవయవాల పనితనాన్ని తెలుసుకుంటే, ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు.
  • మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణములు ఉన్నవి. 
  • మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నవి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలెను.
  • హార్మోనియం లో 45 కీలు, పియానోలో 88 కీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి.
  • మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళములు కలవు. ప్రతి క్షణమునకు 20 లక్షల కణములు తయారగుచున్నవి.
  • మానవుని హృదయము నిముషమునకు 72 సార్లు, రోజుకు ఇంచు మించు 1,00,000 సార్లు, సంవత్సరమునకు 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొనుచున్నది.
  • మానవుని జీవిత కాలములో హృదయము లోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేయును.
  • మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వచ్చును.
  • మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు కోపపడటానికి 43 కండరములు పనిచేస్తాయి.
  • మనిషి చర్మములొ 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి.
  • మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉండును.
  • మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి.
  • ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చును.
  • మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి.
  • మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి.
  • మానవుని పంటి దవడ 276 కేజీ ల కంటే ఎక్కువ బరువు ఆపగలదు.
  • మానవుని శరీరములో 206 ఎముకలు కలవు.
  • మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు, 35000 kgs food తింటారు.
  • మనిషి నోటిలో రోజుకు 2 నుండి 3 పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది.
  • మనిషి జీవిత కాలములో గుండె 100 ఈతకోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది.
  • మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము.
  • మానవుని శరీరములో 100 ట్రిలియను కణములు ఉంటాయి.
  • మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది.
  • మానవుని మెదడుకు నొప్పి తెలియదు.
  • మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14% ఉంటుంది.
  • మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది.
  • మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి. వీటిలో 75% నీరు ఉంటుంది.
  • తుమ్ము గంటకు 100 మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది.
  • చేతి వ్రేళ్ల గోళ్ళు కాలి వ్రేళ్ల గొల్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగుతాయి.
  • స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది.
  • స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు అర్పుతారు.
  • రక్తము నీరు కన్నా కూడా 6 రెట్లు చిక్కగా ఉంటుంది.
  • మానవుని మూత్రపిండములు నిముషమునకు 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేస్తాయి. రోజుకు 1.4 లీటర్ల మూత్రమును విసర్జిస్తాయి.
  • స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటుంది.
  • మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది.
  • మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన.
  • ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల సమయము పడుతుంది.
  • రక్తములోని ప్రతి చుక్క కూడా శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది.
  • మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత కుడా పెరుగుతాయి.
  • మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు.
  • మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది.
  • మనిషి మెదడులోని కుడి బాగము శరీరములోని ఎడమ బాగమును, మెదడులోని ఎడమ బాగము శరీరములోని కుడి బాగమును అదుపు చేయును.
  • మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకగలడు.
  • మనిషి ముఖములో 14 ఎముకలు ఉండును.
  • మానవుని నాడి నిముషమునకు 70 సార్లు కొట్టుకొనును.
  • ప్రతి 7 రోజులకు ఒకసారి శరీరములోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడును.
  • మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేయును.
  • ఆహారము నోటిలో నుండి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది.
  • మనిషి శరీరములో 75% నీరు ఉంటుంది.
  • మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల దూరము (140,000,000,000,000,000,000 మైళ్ళు) చూడవచ్చు. Approx 528 megapixel lense.
  • ఇంత గొప్పగా మనలను తయారుచేసిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండి విజయం సాధిస్తాం.

Popular Posts

Latest Posts