భోజనం తర్వాత ఇలా చేస్తే అదృష్టం పోయి దరిద్ర౦ పట్టుకుంటుంది

Loading...
అన్నం పరబ్రహ్మ స్వరూపం.. సాక్షాత్తూ శ్రీ అన్నపూర్ణా దేవి ఆ పరమశివుడికి అన్నం ప్రసాదించింది. అదీ అన్నానికి ఉన్న గొప్ప వైభవం. అందుకే భోజనం చేయడమంటే నోట్లోకి అన్నం వెళ్ళడమే కాదు.. వడ్డించడం నుంచి తిన్న తర్వాత చేసే పనులు కూడా భోజన ప్రక్రియలోకే వస్తాయి. మరి అలాంటప్పుడు ఆహారం తినేప్పుడు మనం చేయకూడని పనుల గురించి మన ధర్మ శాస్త్రాలు ఏం చెబుతున్నాయో కింద తెలుసుకుందాం..
తిన్న తర్వాత:
భోజనం తిన్నాక చేతులని కంచం లేదా పళ్లెంలో ఎట్టి పరిస్థితుల్లో కడుగరాదు. ఇది పరమ దారిద్ర హేతువు, తిన్నాక కేవలం చేతులని వేరొక చోట మాత్రమే కడగాలి.
తిన్న కంచాన్ని:
తిన్న కంచాన్ని ఎప్పుడూ కూడా తిన్నచోటే వదిలేయకూడదు. ఇలా చెయ్యడం వల్ల దారిద్ర లక్ష్మి వచ్చి కూర్చుంటుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయ్.
చేతులు కడిగేప్పుడు:
అన్నం తిన్నాక ఎవరైనా చేసే పని కుడి చేతిని మాత్రమే కడగడం.. ఒక్క చేత్తోనే కదా తినేది రెండు చేతులు ఎందుకు అనే లాజిక్ ని పక్కనపెట్టి రెండు చేతులూ పరిశుభ్రంగా కడుక్కోవాలి.
ఆఖరున ఇలా చేయాలి:
చేతులు కడుక్కున్న తర్వాత చేతులు, మూతి పరిశుభ్రమైన క్లాత్ తో తుడుచుకున్నాక మాత్రమే ఆహారం తినడం పూర్తయినట్లు.
Loading...

Popular Posts