మీ బెడ్‌ రూమ్‌ లైట్‌కూ బరువు పెరగడానికి లింక్ ఉంది.. ఒకసారి ఇది చదవండి !

మీ బెడ్‌ రూమ్‌ వెలుతురుకు మీరు బరువు పెరగడానికి లింక్ ఉందట! నిజమేనండి. ఇందేంటని అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవండి. మహిళలు బెడ్‌ రూమ్‌‌లో ఉపయోగించే లైట్లను బట్టే మీకు ఒబేసిటీ రిస్క్ ఉందా లేదా అనే విషయాన్ని ఇట్టే కనిపెట్టొచ్చని లండన్‌లోని క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో 113,000 మంది మహిళలు పాల్గొన్నట్లు అమెరికన్ జర్నల్ ప్రచురించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న మహిళల వద్ద వారు ఉపయోగించే లైట్ల వెలుతురుపై ప్రశ్నలు అడగినట్లుక్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ స్వెర్డ్లో తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ… చాలామంది మహిళలు అద్భుతంగా వెలుతురు వెదజల్లే లైట్స్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ లైట్స్ వల్లే భారీ బరువు, ఒబేసిటీ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. అదే తక్కువ వెలుతురు గల లైట్స్ వాడే వారిలో ఒబేసిటీ ప్రాబ్లమ్ తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలిందన్నారు. రాత్రుల్లో వెలుతురు తక్కువగా ఉండే లైట్లను వాడటం ద్వారా మానసిక స్థితి ప్రశాంతంగా మారుతుంది. ఇలా చేస్తే రాత్రిపూట సుఖనిద్ర సాధ్యమవుతుందని, తెల్లవారుజామున ఎలాంటి ఆందోళనలు లేకుండా రోజంతా సాగిపోతుందని తెలిపారు. వాడే లైట్స్, వెలుతురు మనిషి మానసిక పరిస్థితి, శారీరక సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని స్వెర్డ్లో వెల్లడించారు. ఈ అధ్యయనంలో వెలుతురు తక్కువగా ఉండే లైట్స్ వాడటంతో పాటు అలారమ్ క్లాక్స్, ఎలక్ట్రికల్ ఉత్పత్తులైన టీవీ, కంప్యూటర్లు బెడ్‌రూమ్‌లో ఎక్కువగా వాడకపోవడమే మంచిదని తేలినట్లు సూచిస్తున్నారు. ఇంకా డార్క్ లైట్‌లో నిద్రపోవడం ద్వారా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టడంతో పాటు ఒబిసిటీని నియంత్రించవచ్చునని స్వెర్డ్లో తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)