వారానికి ఒక సారైనా గుప్పెడు నువ్వులు తింటే ఎన్నో లాభాలు

వారానికి ఒక సారైనా గుప్పెడు నువ్వులు తింటే ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో పోషకాలు ఎక్కువ. మాంసకృత్తులు, ఆమినోయాసిడ్లు నువ్వుల్లో సమృద్ధిగా ఉన్నాయి. మెగ్నీషియం శాతమూ ఎక్కువే.
  • పోషకాలు పుష్కలంగా ఉండే నువ్వులు.. శరీరంలోని కొవ్వును కరిగించడంలో బాగా పనిచేస్తాయి. 
  • క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి. 
  • వారం రోజుల పాటు రెండు స్పూన్ల నువ్వుల్ని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 
  • నువ్వులు మాత్రమే కాకుండా వాటి నుంచి తీసిన నూనె కూడా రక్తంలో కొవ్వులు పేరుకోకుండా చేయడం ద్వారా హృద్రోగాల్ని నియంత్రిస్తుంది. ఇంకా బీపీని తగ్గిస్తుంది. 
  • గుప్పెడు నువ్వుల్లో ఒక గ్లాసు కంటే ఎక్కువ క్యాల్షియం లభిస్తుంది, ఎముకల ఆరోగ్యం బాగా పెరుగుతుంది
  • కాలేయ పనితీరును మెరుగుపరిచే నువ్వులను తీసుకుంటే కీళ్ల నొప్పులు దరిచేరవు.
  • అనీమియాతో బాధపడేవాళ్లకి నల్ల నువ్వుల్లోని ఐరన్ ఎంతో మేలు చేస్తుంది 
  • నువ్వుల్లోని థైమీన్, ట్రిప్టోఫాన్ అనే విటమిన్లు సెరటోనిన్ ను ఉత్పత్తి చేయడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచి మంచి నిద్ర పట్టేలా చేస్తాయి. తద్వారా నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. 
  • ఇందులోని యాంటీయాక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)