వయసు 19.. ఆస్తి రూ.8 వేల కోట్లు.. ఎలా సంపాదించిందో తెలిస్తే దిమ్మ తిరిగిద్ది

అలెగ్జాండ్రా అండర్సన్‌ మాత్రం ప్రపంచంలోనే పిన్న వయస్కురాలైన బిలియనీర్‌గా ఫోర్బ్స్‌ జాబితాకెక్కింది. ఈ నార్వే చిన్నదాని సంపద అక్షరాలా రూ.ఎనిమిదివేల కోట్లు. పందొమ్మిదేళ్ల అమ్మాయి ఏం చేస్తుంది. కాలేజీకి వెళుతూ ఫ్రెండ్స్ తో సినిమాలు, షికార్లు చేస్తుంది. మహా అయితే పుస్తకాలతో కుస్తీ పడుతూ పోటీ ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనిస్తుంది. కానీ అలెగ్జాండ్రా అలా చేయలేదు. తన కుటుంబీకుల నుంచి అప్పనంగా వచ్చిన ఆస్తిని రెట్టింపు చేయడమే పనిగా పెట్టుకుంది. తనకు ఊహ తెలిసినప్పటి నుండి అంటే దాదాపూ ఏడు సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్, షేర్లలో పెట్టుబడులు పెట్టింది. దీంతో తన ఆస్తి రెట్టింపు అయ్యి..ఫోర్బ్ జాబితాలో పిన్నవయసులో బిలినియర్ స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాదండోయ్ ఇంత ఆస్తి ఉన్నా తను ఏనాడు ఆ దర్పాన్ని ప్రదర్శించేది కాదు. ఇన్నీవేల కోట్ల ఆస్తి ఉన్న పాతకార్లను వాడుకునేది. అంతేకాదు తనకు గుర్రపు రేసులు, క్విజ్ పోటీలు అంటే చాలా ఇష్టం. వాటిల్లో పాల్గొని వచ్చిన ఫ్రైజ్ మనీతో అవసరాలను తీర్చుకునేది. ఒక్కోసారి పేద అమ్మాయిలా ఉండే అండర్సన్. ఓ సారి బ్యాంక్ ఖాతాలో కోట్ల రూపాయలు ఉండటం చూసిన తన స్నేహితులు నోరెళ్లబెట్టేవారని తెలిపింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)