ఇతను చేసే ఉద్యోగం తెలిస్తే వెంటనే సెల్యూట్ కొడతారు... ఇలాంటి మంచి మనుషులు గురించి మన మీడియా హైలైట్ చేయదు.. ఖచ్చితంగా తెలుసుకోండి

Loading...
ఈ ఫోటోలో ఉన్న వ్య‌క్తి పేరు…. శివ‌న్, తమిళనాడులో పోస్ట్ మ్యాన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈయ‌న ఉత్త‌రాలు బ‌ట్వాడా చేసే క్ర‌మంలో ప్ర‌తిరోజూ ఓ పెద్ద యుద్ద‌మే చేయాల్సి ఉంటుంది. ప్రాణాల‌కు ప్ర‌మాద‌మ‌ని తెలిసినా, ఉద్యోగాన్ని ఎంతో బాద్య‌త‌గా ఫీల్ అవుతూ త‌న ఉద్యోగ ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తిస్తున్నాడు. తమిళనాడు లో కునూర్ అనే
గ్రామంలో 
శివ‌న్ పోస్ట్ మ్యాన్ గా ఉద్యోగం చేస్తున్నాడు, అయితే… ఈ ఊరికి 15 కిలోమీట‌ర్ల దూరంలోని మ‌ర‌ప్ప‌ల‌మ్, బులిరియార్ అనే కొండ ప్రాంతాల్లో టీ ఎస్టేట్ లు ఉన్నాయి, కొంత మంది కార్మికులు అక్క‌డే స్థిర నివాసం ఏర్ప‌ర‌చుకొని అక్క‌డి కాఫీ-టీ తోట‌ల‌లో ప‌నిచేస్తుంటారు. ఈ రెండు గ్రామాలు కూడా ఈయ‌న ప‌రిధిలోకే వ‌స్తాయి.

దీంతో… ఆ గ్రామ ప్ర‌జ‌ల‌కు వ‌చ్చే ఉత్త‌రాలు, పించ‌న్ల‌ను 15 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి మ‌రీ అందిస్తాడు శివ‌న్, అయితే ఆ గ్రామాల‌కు చేరుకోడానికి ఎటువంటి బ‌స్ రూట్స్ లేవు, కేవ‌లం కాలిన‌డ‌క…. కొండ‌ల‌ను ,అడ‌వుల‌ను దాటుకుంటూ వెళ్తాడు ఈ పోస్ట్ మ్యాన్, అంతేకాదు మార్గ‌మ‌ద్యంలో ఎదుర‌య్యే ఏనుగులు, పాములు, ఎలుగుబంట్ల‌ను కూడా త‌ప్పించుకొని త‌న క‌ర్త‌వ్యాన్ని కొన‌సాగిస్తున్నాడు శివ‌న్.

ఓ సారి… త‌ను పించ‌న్ ఇవ్వాల్సిన వ్యక్తి ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నాడ‌ని తెలిసి… త‌న సొంత ఖ‌ర్చుల‌తో ఆ ఆసుప‌త్రికి వెళ్లి, అత‌నికి ఇవ్వాల్సిన పించ‌న్ ను ఇచ్చి వ‌చ్చాడు శివ‌న్, త‌మ కోసం ఇంత‌దూరం వ‌చ్చి ఉత్త‌రాలు ఇస్తున్నందుకు.. ఎన్నో సార్లు టీ తాగండి అని ఆ కొండ ప్రాంత ప్ర‌జ‌లు అడిగినా సున్నితంగా తిర‌స్క‌రించేవాడండ , కాసిన్ని మంచినీళ్లివ్వండి చాల‌ని అడిగి తీసుకొని, తాగి వారికి టాటా చెప్పి తిరుగు ప్ర‌యానం చేసేవాడంట.!
Loading...

Popular Posts