నెలకు 2 నుండి 3 సార్లు ఇలా చేయండి.. జుట్టు ఊడటం ఆగి ఫాస్ట్ గా పెరుగుతుంది

ఉల్లి ని జ్యూస్ గా చేసి మాడుమీద మాత్రమే పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన  హెయిర్ ఫాస్ట్ గా పెరుగుతుంది ఇంకా ఆరోగ్యముగా కూడా ఉంటుంది.
  • ఉల్లిని 4 ముక్కలుగా కట్ చేసి.. మిక్సీ లో వేసి జ్యూస్ చేయాలి.
  • వచ్చిన జ్యూస్ ని ఒక శుభ్రమైన గిన్నెలో తీసుకోండి.
  • తరువాత కొద్దిగా కాటన్ (దూది) తీసుకొని జ్యూస్ లో ముంచి.. తలపై జుట్టుకి అంటకుండా జుట్టుని పాయలు చేసి .. మాడు పై మాత్రం రాయండి.
  • మొత్తం రాసాక నిదానంగా మాడు పై రుద్దుకొని.. 15 నుండి 30 నిమిషాలు అలా వదిలేయండి.
  • తరువాత వెచ్చని వాటర్ లో కొంచం షాంపూ పెట్టి వాష్ చేసుకోండి.
  • ఉల్లి జ్యూస్ మాడుకి మాత్రమే పెట్టాలి, కొద్దిగా జుట్టు కి అంటుకున్నా ఏమి కాదు.
  • కాటన్ మాత్రమే వాడండి. ఎందుకంటే అది తేమని పీల్చుకుంటుంది.
  • ఉల్లి ఎరుపు రంగులో ఉండాలి.
  • నెలకు 2 నుండి 3 సార్లు ఇలా చేయండి. ఇలా చేయడం వలన జుట్టు ఊడటం కూడా తగ్గుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)