ముఖం పై జిడ్డుని పోగొట్టుకుని అందంగా ఆకర్షణీయంగా కనపడాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి

Loading...
  • వాతావరణంలో పెరిగిన కాలుష్యం.. స్వేదరంధ్రాలపై దుమ్ము, ధూళి అంటుకోవటంతో ముఖం జిడ్డుగా మారుతుంది. మార్కెట్లో దొరికే సౌందర్య సాధనాలతో ఈ జిడ్డును తొలగించుకునే ప్రయత్నంలో అనేక సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తుంటాయి. వీటిని నివారించేలా ఇంటిలోనే సులభమైన చిట్కాలు పాటించవచ్చు.
  • రోజూ ఉదయాన్నే కలబంద గుజ్జును తీసి ముఖంపై పట్టించి రుద్దాలి. 20 నిమిషాల తర్వాత వేడి నీటి స్నానం చేస్తే జిడ్డు వదులుతుంది. 
  • రోజ్‌వాటర్‌తో ముఖం తరచుగా శుభ్రపరచటం వల్ల చర్మంపై ఉండే సూక్ష్మరంధ్రాలు శుభ్రంగా తయారవుతాయి. 
  • తేనె, నిమ్మరసం, కొద్దిగా చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. ఆ మిశ్రమం ఆరిపోయాక ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.
  • ఒక బౌల్‌లో టొమాటో రసం, నిమ్మరసం, పాలు, కొద్దిగా నూనె కలిపి ముఖానికి పట్టిస్తుంటే ముఖచర్మం అందంగా తయారవటమే కాదు మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. 
  • బాదం పప్పులను మెత్తగా నూరి ముఖానికి అంతా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. 
  • ముఖానికి పెరుగు పట్టిస్తే అందులో ఉండే లాక్టిక్‌ ఆసిడ్‌ చర్మరంధ్రాలను శుభ్రపరుస్తుంది. ఆయిల్‌ ఫేస్‌లో ఉండే జిడ్డును పెరుగు పోగొడుతుంది.
  • స్నానానికి ముందు ముఖంపై తేనెను రాస్తే చక్కని ఫలితం ఉంటుంది. 
  • నీటిలో కీరదోస రసం గాని, ఆపిల్‌ రసం గాని, గ్రీన్‌ టీ గాని కలిపి ఫ్రిజ్‌లో ఐస్‌గా చేసి గుడ్డను మూటకట్టి ముఖంపైన కొద్దిసేపు ఉంచి కడిగేయాలి. ఇలా రెండు, మూడు సార్లు చేస్తే చర్మం అందంగా తయారవుతుంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...