వ్యాయామం చేయట్లేదని బాధపడుతున్నారా ? ఏం పర్వాలేదు వేడి నీటితో స్నానం చేస్తే 30 నిముషాలు వ్యాయామం చేసినట్టే

వ్యాయామం చేయలేక పోతున్నామని ఇక చింతించనక్కర్లేదు. వేడి నీటితో స్నానం చేస్తే చాలు, వ్యాయామం చేసిన ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వ్యాయామం చేసినప్పుడు శరీరంలో వేడిపుడుతుంది, అదేవిధంగా వేడి నీటితో స్నానం చేసినా శరీరంలో వేడిపుడుతుందని యూకే లోని లుఫ్‌బురో యూనివర్సిటీకి చెందిన స్టీవ్‌ ఫాల్కనర్‌ చెప్పారు. 2300 మంది మధ్య వయసు వ్యక్తులను సగటున 20 సంవత్సరాలు అధ్యయనం చేశారు. వేడినీటి స్నానం తరుచూ చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి.. రక్తపోటు తగ్గుతుందని, తద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయని స్టీవ్‌ అన్నారు. ఎక్కువ సేపు వేడినీటితో స్నానం చేయడం వల్ల 140 కెలరీలు ఖర్చయ్యాయని, ఇది 30 నిమిషాలు వడివడిగా నడవడంతో సమానమని తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)