కోపం ఆరోగ్యానికి ఎంతో హానికరం కోపాన్ని తగ్గించుకోవడానికి ఉత్తమమైన పరిష్కారాలు

సాధారణంగా మానవులందరికీ భావోద్వేగాలు వుండటం సహజం. అవి సందర్భాలను బట్టి బయటకు వస్తూ ఉంటాయి. సంతోష భావోద్వేగాలు ఆరోగ్యానికి చాలావరకు మంచి చేస్తాయి. కాబట్టి వాటి గురించి చర్చించుకోవాల్సిన అవసరం అంతగా లేదు. కానీ కోపం లాంటి భావోద్వేగం ఆరోగ్యానికి ఎంతో హానికరం. నిజానికి మానసికంగా కుంగిపోతున్న సమయంలో కోపం వస్తుంది. అలా కాకుండా ప్రతిచిన్న విషయాలకు కోపోద్రిక్తులైతే మాత్రం ఆరోగ్యానికి హానికరమైన సంకేతంగా నిలుస్తుంది. కోపాన్ని చాలావరకు బయటకు వదిలేస్తేనే మంచి కానీ.. దానిని లోపలే అణుచుకుంటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదకరం. అటువంటి సమయాల్లో ఆ కోపాన్నే అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది. మరి ఈ కోపాన్ని అదుపులో వుంచే ఆ హెల్తీ మార్గాలేంటో ఒకసారి తెలుసుకుందాం....
  • అటువంటి సమయాల్లో దీర్ఘశ్వాస తీసుకోవాలి. ఈ పద్ధతిలో ఎక్కువ ఆక్సిజన్‌ శరీరంలోకి ప్రవేశించి, కోపాన్ని చాలావరకు తగ్గించి, మెదడులో ఒత్తిడిని తగ్గిస్తుంది.
  • కొంతమంది తమ మనసులో వున్న కోరికలను, బాధను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. అలాకాకుండా.. మనసులో వున్న భావోద్వేగాలను ఎప్పటికప్పుడు ఇతరులతో పంచుకుంటే మంచిది. అలాగే ఎవరైనా నిత్యం అసహనానికి గురిచేస్తే అటువంటివారికి సూటిగా సమాధానం చెప్పేయాలి. 
  • ఇంట్లో వివాదాలు చోటు చేసుకోవడం సహజం. ఆ సమయంలో ఎక్కువ కోపానికి గురవ్వడమే కాకుండా.. మనసులో ఉన్న అన్ని భావేద్వేగాలను చంపుకోవాల్సి ఉంటుంది. ఆ వాతావరణం నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కలిస్తే మంచిది. దానివల్ల మనసులో ఉండే భావోద్వేగాలు, మెదడులో ఉండే ఒత్తిడి తగ్గిపోతుంది.
  • కొంతమందికి నచ్చని విషయాలను వెల్లడిస్తే దానికి వెంటనే కోపంగా రియాక్ట్‌ అవుతుంటారు. అలా వెంటనే రియాక్ట్‌ కాకుండా కొద్దిసేపటి వరకు కూల్‌గా ఆలోచించిన తర్వాత స్పందిస్తే మంచిది. 
  • ఎక్కువ కోపానికి గురైనప్పుడు తమ భావోద్వేగాలను ఇతరుల మీద ప్రదర్శించకుండా వాటిని ఒక డైరీలోనో పొందుపరుచుకుంటే చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి.
  • అలాగే ఇష్టమైన సంగీతం వినడం. సంగీతం వినడం వల్ల మెదడు చాలా ప్రశాంతంగా వుంటుంది కాబట్టి... మానసికంగా ఎటువంటి ఒత్తిళ్లు వుండవు. పైగా శరీరం కూడా చాలా ప్రశాంతంగా వుంటుంది. ఆరోగ్యంగా వుండటానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ సమయానుకూలంగా సంగీతం వింటే చాలా మంచిది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)