దంతాల శుభ్రత కోసం.. తెల్లని దంతాల కోసం ఇలా చేయండి

  • సాధారణంగా మనిషి అందం సూచించేవాటిలో జుట్లు, కళ్లు, ముక్కు తో పాటు పళ్లు కూడా చాలా ప్రాధాన్యంగా చూస్తారు. ముఖంపై అన్ని అవయవాలు బాగున్నా పంటి వరుస బాగా లేకున్నా గారె పట్టినా ఎదుటి వాళ్లు కాస్త చిన్న చూపు చూస్తారు. మనం దంతాలను రోజూ శుభ్రం చేసుకుంటే ఎలాంటి దుర్వాసన ఉండకుండా దంతాలు కూడా చక్కగా ఉంటాయి. 
  • దంతాల శుభ్రత కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
  • పుదీనా ఆకులు క్రిమిసంహారకము. పుదీనా ఆకులను నీటితో శుభ్రం చేసుకొని నోట్లో వేసుకొని నమలడం వలన పళ్ళు సమస్యలన్ని, దురువాసనను కూడా తొలగిస్తుంది.
  • రోజులో ఒకసారి స్ట్రాబెర్రీని దంతాలకి రాయటం వలన తెలుపుని పొందవచ్చు. స్ట్రాబెర్రీని పళ్ళకి రాసిన తరువాత బ్రెష్ చేయటం చాలా మంచిది.
  • తినే సోడా అనేది పళ్ళు తెల్లగా మారటానికి శక్తివంతమైన సహజసిద్దమైన గృహా వైద్యం. ఇది సహజసిద్దంగా శుభ్రపరచి, పళ్ళని తెల్లగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. చిటికెడు ఉప్పు, బేకింగ్ సోడాని కలిపి కొన్ని నీటి చుక్కలని కలిపి జిగురు పదార్ధంలా చేయాలి. ఈ సహజ సిద్దమైన జిగురు పదార్థంతో రెండు వారాలకి ఒకసారి బ్రెష్ చేయాలి. తోమిన తరువాత మీ దంతాల నుండి బేకింగ్ సోడాని పుకిలించి తోలగించుకోవాలి.
  • పీచు పద్దార్థలు ఉన్నా ఆహారాలు, ఫ్రూట్స్ , గ్రీన్ వెజిటేబుల్స్ ను తీసుకోవడం వల్ల దంతాలను గట్టిగా ఉంచతాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)