టూత్ పేస్ట్ ల కంటే.. సింపుల్ గా కొబ్బరినూనె వాడితే చాలా ఉత్తమమని సైంటిస్ట్ లు నిరూపించారు

మీ టూత్ పేస్ట్ ఉప్పు ఉందా ? టూత్ పేస్ట్ లో లెమన్ ఉందా ? టూత్ పేస్ట్ చార్కోల్ ఉందా ? అంటూ రకరకాల యాడ్స్ తో ఊదరగొట్టే టూత్ పేస్ట్ లకు విసిగిపోయారా ? సెన్సిటివ్ టూత్ పేస్ట్ లు వాడినా.. ఫలితం లేక డెంటల్ కేర్ గాడీ తప్పుతోందా ? నిజమే రకరకాల బ్రాండ్స్, ఫ్లేవర్స్ తో వచ్చిన టూత్ పేస్ట్ ల కంటే.. సింపుల్ గా కొబ్బరినూనె ఉపయోగించడం చాలా సేఫ్ అండ్ హెల్తీ అంటున్నారు నిపుణులు.  
కొబ్బరినూనె పంటి ఆరోగ్యానికి చాలా మంచిదని అధ్యయనాలు నిరూపించాయి. మార్కెట్ లో దొరికే రకరకాల టూత్ పేస్ట్ లు ట్రై చేయడం కంటే.. కొబ్బరినూనె వాడటం అన్ని రకాల మంచిదని ఈ స్టడీస్ సూచిస్తున్నాయి.
కొబ్బరినూనె పేస్ట్ కి కావాల్సిన పదార్థాలు :
అరకప్పు కొబ్బరినూనె, 
3 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, 
తగినంత పెప్పరమింట్ ఆయిల్( ఇది లేకపోయినా పర్వాలేదు ).

తయారు చేసే విధానం:
అన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. పేస్ట్ లా తయారు అయ్యేంతవరకు బాగా మిక్స్ చేసి.. ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ని రెగ్యులర్ గా వాడితే మంచి ఫలితం ఉంటుంది.
చిగుళ్ల ఆరోగ్యానికి:
కొబ్బరినూనె చిగుళ్ల నుంచి రక్తస్రావం, వాపుని నివారిస్తుంది. అలాగే చెడు బ్యాక్టీరియాను నాశనం చేసి.. చిగుళ్లలో పుండ్లు రాకుండా నివారిస్తుంది.
నాలుకను కొబ్బరినూనెతో శుభ్రం చేసుకోవడం వల్ల నోట్లో ఉండే ఫంగల్ ని బయటకు పంపుతుంది. దంతక్షయాన్ని నివారిస్తుంది.
కొబ్బరినూనె పేస్ట్ వల్ల.. బ్యాక్టీరియా, పంటి ఆరోగ్యంపై ప్రభావంచూపే ఇతర హానికర క్రిములను నాశనం చేస్తుందని ఐరిష్ సైంటిస్ట్ లు నిరూపించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)