షుగర్ వ్యాధి ఎలా వస్తుందో, ఎవరికీ వస్తుందో, ఏ ఏ ఆహారపదార్దాలు, ఎటువంటి అలవాట్లు వలన ఖచ్చితంగా తెలుసుకోండి

Loading...
మదుమేహం ఎవరికి వస్తుంది
1) సహజ మదుమేహం అంటే తల్లి తండ్రుల జీన్స్  ఆధారం చేసుకొని వచ్చేది. తల్లి తండ్రుల నుంచి వారి సంతానానికి ఏ విదంగా నైతే కొన్ని లక్షణాలు ప్రాప్తిస్తాయో అదే విదంగా కొన్ని రకాల వ్యాదులు కుడా సంక్రమిస్తాయి. వాటిలో మదుమేహం ఒకటి.
2) ఇక రెండొవది ఆహారపదార్ధాల వలన, శరీరం లొ జరిగే మార్పుల వలన సంక్రమిస్తుంది.
ఏ ఆహర పదార్ధాల వలన వస్తుంది.
 • పెరుగును అధిక ప్రమాణం లొ తీసుకొవడం.
 • కఫాన్ని పెంచే నైజం ఉన్న పాలు, బెల్లం వంటి పదార్ధాలని ఎక్కువ తీసుకొవడం.
 • సుఖమైన, దిగబడి పోయేంత మెత్తని దిండు లను, పరుపులను ఉపయోగించడం .
 • సోమరితనాన్ని వదలలేకపోవడం.
 • అవసరానికి మించి నిదుర పొవడం.
 • కొవ్వుని పెంచే నైజం ఉన్న ఆహార పదర్ధాలని ఎక్కువుగా తీసుకొవడం.
 • పగలు నిద్రించడం
 • వ్యాయామం జోలికి పోకపోవడం.
 • చల్లారిన అన్నపానాలను , జిగురు కలిగిన ఆహర పదార్ధాలను ఎక్కువు గా తీసుకొవడం.
మధుమేహాన్ని గుర్తించడం
 • వంశపారం పర్యంగా, మీ పెద్దవాళ్ళకు షుగర్ వ్యాధి ఉన్నాకాని,
 • చిన్నపాటి పనికే నీరసం వస్తున్నా .
 • అతిగా దాహం గా అనిపిస్తున్నా
 • గాయాలు , పుళ్లు తేలిక గా మానకున్నా
 • అదికం గా చెమట పట్టడం.
 • శరీరం దుర్గంధం గా ఉండటం.
 • ఒళ్ళు నొప్పులు, బడలిక ఏర్పడటం.
 • ఎప్పుడు నిద్రపోవాలి అని, విశ్రమించాలి అనిపించడం.
 • శరీరం లావు ఎక్కడం.
 • కళ్ళు పుసులు కట్టడం.నాలుక మీద పాచి చేరడం,చెవులో గుబిలి తయారు అవ్వడం.
 • గోళ్లు , వెంట్రుకలు అతిగా పెరిగిపోవడం.
 • తలపైన ఉండే జుట్టు జడలు కట్టడం.
 • అరికాళ్ళు, అరిచేతులు లలొ మంటలు పుట్టడం, తిమ్మిరులుగా అనిపించడం.
 • నోరంతా తియ్యగా ఉండటం.
 • మూత్రం తియ్యని వాసనని కలిగి కలకబారినట్టు ఉండటం.
 • మూత్రం ఎక్కువ సార్లు , ఎక్కువ ప్రమాణం లొ పొవడం.
పైన చెప్పిన లక్షణాలు కలిగి ఉంటే మదుమేహం గా అనుమానించాలి.
మధుమేహ రోగులు తినకూడని పదార్దాలు
చెక్కెర, బెల్లం ,జామ్, ఐస్ క్రీం, క్రీం కలిగిన కేకులు , తియ్యని పండ్లు, ఖర్జూరం, చిలగడ దుంపలు, చెక్కెర కలిపిన ఫలరసాలు, స్వీట్స్, గేద నెయ్యి, వెన్న, డాల్డా, కొవ్వు కలిగిన మంసాహారం, కొడి గుడ్డులోని పచ్చసోన తినకుడదు.
తీసుకొవలసిన పదార్దాలు
కురగాయల్లొ బూడిద గుమ్మడి, క్యాబేజీ, బీన్స్, చిక్కుడు, వంకాయలు, బెండకాయలు, ములగాకాడలు, పొట్లకాయ, ఉల్లి, కాకర, దోస, టమాటో , పుట్టగొడుగులు, బెంగళూరు మిరప, ఆకు కూరలు, ముల్లంగి మొదలయినవి . పండ్లలో సీతాఫలాలు, బొప్పాయి, మేడి పండ్లను తీసుకోవచ్చు.

పప్పుల్లో పెసరపప్పు, మినుములుని, కందిపప్పుని, శెనగ పప్పుని తీసుకొవచ్చు.
ధాన్యం విషయానికి వస్తే ఉడకబెట్టిన అన్నాన్ని, గోదుమలని తీసుకొవచ్చు. బియ్యం, అటుకులు, వేరుసెనగ, కొబ్బరి, దుంపలు, పచ్చి అరటిపళ్ళు, క్యారెట్, మత్తు పానీయాలు బాగా తగ్గించి తీసుకోవాలి.
Loading...

Popular Posts