ఖాళీ కడుపుతో అంటే పరగడుపున అస్సలు తినకూడని ఆహార పదార్ధాలు

Loading...
'ఆహారాన్ని మితంగా తీసుకుంటే ఔషధం. అతిగా తింటే విషం' అన్న సంగతి మనకి తెలిసిందే. అయితే కొన్ని ఆహారపదార్ధాలు కొన్ని కొన్ని సమయాల్లో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అవే ఆహారపదార్థాలను పరగడుపున తీసుకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. పరగడుపున అంటే ఎర్లీ మార్నింగ్‌ కాదని ఎమ్టీ స్టమక్‌ (ఖాళీ కడుపుతో) అని వారు అంటున్నారు. మరి క్షణం తీరిక లేని జీవన శైలిలో ఆలస్యంగా లేచినా. పరగడుపున తినకూడని ఆహారపదార్ధాలేంటో మనమూ తెలుసుకుందామా.
  • చాలామంది ఉదయం నిద్రలేవగానే కాఫీ, టీ లను తాగుతుంటారు. ఉదయం వాటిని తాగడం మంచిదే అయినా పరగడుపున తాగడం మంచిది కాదని, ఈ విధంగా తాగడం వల్ల హార్మోన్లు అన్‌ బ్యాలెన్స్‌ అవుతాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఒక గ్లాస్‌ మంచి నీటిని తాగిన తర్వాతే కాఫీ, టీ లు తాగటం మంచిదంటున్నారు.
  • ఘాటైన మసాలా కూరల్ని పరగడుపున తినకూడదు. అలా తింటే పొట్టలో తిప్పడమే కాక రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. ఇదే పరిస్థితి ఎక్కవ కాలం కొనసాగితే అల్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఉదయం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. 
  • చాలా మంది పరగడుపున టమోటా రైస్‌, టమోటా బాత్‌ లాంటివి తింటుంటారు. కానీ ఖాళీ కడుపుతో పుల్లని పదార్థాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఏదైనా వేరే పదార్థం తిన్న తరువాత పుల్లటి పదార్థాలు తినడం మంచిదంటున్నారు డాక్టర్లు. 
  • పరగడుపున పళ్లు తినడం మంచిదని ఇటీవల ప్రచారం జోరుగా జరుగుతోంది. కానీ అది నిజానికి అంత మంచిది కాదు. అందునా అరటి పండు అస్సలు తినకూడదు. అందులో ఉన్న మెగ్నీషియం ఉదయం పూట ఎక్కువ మోతాదులో శరీరానికి అందటం మంచిదికాదు. 
  • పరగడుపున శీతల పానీయాలు తాగడం వల్ల జీర్ణాశయంలో హాని చేసే కొన్ని ఆమ్లాలు విడుదలౌతాయి. ఈ ఆమ్లాల కారణంగా వికారం, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు. కాబట్టి ఖాళీ కడుపుతో తినేముందు కాస్త జాగ్రత్త వహించడం మంచిది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...