పర్స్ ను వెనుక జేబులో పెడతున్నారా..! అయితే జాగ్రత్త.. మీకు నడుమునొప్పి గ్యారంటీ

Loading...
మీరు పర్స్‌ను ఎక్కడ పెట్టుకుంటున్నారు? ఇదేం ప్రశ్న , ఎక్కడపెట్టుకుంటారు జేబులో...అంటారా. అదే ఏ జేబులో... ఖచ్చితంగా వెనక జేబులో పెట్టుకుంటారు. అయితే మీకు నడుమునొప్పి లేదా వెన్నెముక నొప్పి గ్యారంటీ. మనలో చాల మంది ఆఫీసులో ఎక్కువ కుర్చోవటం వల్ల, బైక్‌ ఎక్కువగా నడపటం వల్ల అనుకుంటాం... కాని ఇవి వెన్నునొప్పికి కొన్ని కారణాలై ఉండవచ్చు. కాని పర్స్ వెనకాల పెట్టడం వల్ల కూడా నడుమునొప్పి వస్తుంది.

మనలో చాలా మంది మనీ పర్స్‌ని వెనుక జేబులో ఉంచుకొని అలానే గంటల తరబడి కూర్చోవడం వలన నడుము నొప్పి వస్తోంది. ఎందుకంటే అలా ఒకేచోట పర్స్ జేబులో పెట్టుకొని కూర్చోవడం వలన సరిగ్గా కూర్చేలేం. మన పిరుదులు రెండు సమానంగా ఉండకుండా ఈ వాలెట్ పెద్దదిగా ఉండటంతో ఒకవైపు ఎత్తుగా, మరోవైపు కిందుగా ఉంటుంది. దీని వల్ల వెన్నెముకపై ఆ భారం పడుతుంది. శరీరంలోని అవయవాలపై వత్తిడి పెరుగుతుంది.

ఇలా మనీపర్స్ లను వెనుక జేబుల్లో స్టైల్ గా వెనుక జేబులో పెట్టుకొని, ఒకవైపుగా కూర్చోవడం వలన సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఇక నుండి మీ వెనుక జేబులో ఇలా మనీ పర్స్, సెల్ ఫోన్స్ అక్కడ పెట్టకండి. ఈ చిన్న టిప్ ని పాటించండి... వెన్నునొప్పి లేకుండా ఆనందంగా జీవించండి.
Loading...

Popular Posts