జీవించి ఉన్నంత కాలం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ లిస్ట్ లో ఉన్న ఆహారపదార్దాలు తింటూ ఉండండి చాలు. ఈ ఆహారపదార్దాలే దివ్యఔషదాలు

ప్రతి మనిషి తాను జీవించి ఉన్నంత కాలం సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుకుంటారు. దీనికోసం వ్యాయామాలు, యోగాలు చేస్తుంటారు.. ఇలాంటి ఏం చేసినా మనం తినే ఆహార పదార్ధలు మన ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. జంగ్ ఫుడ్స్, నిల్వ ఉన్న పదార్ధాలు, ఆయిల్ ఫుడ్స్ లాంటివి తీసుకోవడం వల్ల వెంటనే అవి మన శరీరంపై ప్రభావం చూపిస్తుంటాయి. ప్రస్తుతం కాలం చాలా వేగంగా పరుగెడుతుంది.. దీంతోపాటే మన జీవన విధానం కూడా అలాగే సాగుతుంది. ఇలాంటపుడు మనం ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ద తీసుకున్నా కొన్ని పొరపాట్లు చేయడం దాని వల్ల అనారోగ్యం పాలు కావడం జరుగుతుంది. అయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దివ్యఔషదాలు మన చుట్టూ ఉన్నాయి. వాటిపై కాస్త శ్రద్ద చూపించి వాడితే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.

మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరోగ్య సూత్రాలు :

  1. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
  2. ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
  3. అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
  4. పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
  5. సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
  6. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
  7. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
  8. చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
  9. కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
  10. క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
  11. యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
  12. వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
  13. పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
  14. ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
  15. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
  16. అల్లం తింటే వంట్లో కొవ్వు కరుగుతుంది.
  17. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. జుట్టు బాగా పెరుగుతుంది.
  18. నేరేడు పండ్లల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
  19. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. మగాళ్లలో శృంగార సామర్ధ్యాన్ని పెంచుతుంది.
  20. అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
  21. జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
  22. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
  23. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
  24. మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
  25. దానిమ్మ కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. వంట్లో బాగా రక్తం పడుతుంది. మగాళ్లలో వీర్య వృద్ధి కలిగించి సెక్స్ లో మంచి ఎనర్జీ ఇస్తుంది.
  26. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
  27. అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
  28. కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
  29. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
  30. ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
  31. బీట్ రూట్ రసంలో బీపీ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
  32. క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
  33. ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
  34. జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  35. ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
  36. నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
  37. మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
  38. మునగ కాయలు ఆకలిని పెంచుతాయి. మగాళ్లలో వీర్య వృద్ధిని కలిగిస్తుంది.

Latest Posts