కుర్ర వయసులోనే జుట్టు ఊడిపోతుందని ఫీలవుతున్నారా ? మన వంటింట్లో ఉండే అద్భుతమైన పదార్ధంతో జుట్టు రాలడం ఆగిపోతుంది

మనిషి అందంగా కనిపించడంలో ప్రధాన పాత్ర పోషించేవి వెంట్రుకలు. మారుతున్న కాలంతో పాటు ఆహారపు అలవాట్లలో కూడా మార్పులొచ్చాయి. దీనికి తోడు కాలుష్యం. ఇంకేముంది, జుట్టు రాలడం, జుట్టు పెరగకపోవడం, తెల్ల వెంట్రుకలు రావడం, కుర్ర వయసులోనే వెంట్రుకలు లేక విగ్గులు తగిలించుకోవడం. ఇలాంటి ఎన్నో సమస్యలు యువతరాన్ని పట్టిపీడిస్తున్నాయి. వీటిని అధిగమించడం కోసం మార్కెట్‌లో దొరికే రసాయనాలతో కూడిన ఎన్నో హెయిర్ ప్యాక్స్‌ను చాలామంది వాడుతుంటారు. ఏవి వాడినా ప్రయోజనం లేక డీలా పడిపోతుంటారు.

అయితే వెంట్రుకలకు సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం మీ వంట గదిలోనే ఉందన్న విషయం మీకు తెలుసా ? అవును. జుట్టు రాలే సమస్యకు నెయ్యితో పరిష్కారం దొరుకుందంటున్నారు వైద్య నిపుణులు. అయితే నెయ్యిని తింటూనే ఉంటుంటాం కదా అని మీరనుకుంటే పొరపాటే. నెయ్యిని ఆహారంలో వాడడం కాదు, జుట్టుకు అప్లై చేయాలని చెబుతున్నారు వైద్యులు. ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదలతో పాటు, జుట్టు రాలడాన్ని కూడా అరికడుతుంది. వారానికి రెండు సార్లు తలస్నానం చేసే ఒక గంట ముందు తలకి నెయ్యి రాసుకుని మసాజ్ చేసుకోవాలి. తర్వాత గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేస్తే చాలు. నెయ్యి లో ఉండే ప్రోటీన్స్ జుట్టుకి అందడం వలన జుట్టు రాలటం ఆగిపోతుంది. అంతేకాదు డేండ్రఫ్ లాంటి సమస్యకు కూడా నెయ్యి చక్కని పరిష్కారము.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)