బెల్లం నిజానికి ఒక గొప్ప ఔషధం. బెల్లంలో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.

Loading...
పిండివంటల్లో విరివిగా వాడే బెల్లం నిజానికి ఒక గొప్ప ఔషధం. ఇందులో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. దీన్ని అప్పుడప్పుడు కాక తరచుగా ఆహారంలో భాగంగా తీసుకోవడం అత్యవసరమని కూడా అనిపిస్తుంది. ఇందులో ఉన్న మంచి లక్షణాలు తెలుసుకున్నాక దాని తీపి మరికాస్త పెరిగినట్టనిపిస్తుంది. అవేంటంటే..
 • జీర్ణక్రియకు పనికొచ్చే ఎంజైములు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. పేగుల పనితీరుని మరింత ఉత్తేజపరుస్తుంది. అందుకే బెల్లం మలబద్దకానికి మంచి మందులా పనిచేస్తుంది.
 • లివర్‌లోని హానికరమైన విషాలను బయటకు తోసేందుకు తోడ్పడుతుంది. శరీరంలోని వ్యర్థాలను సమర్ధవంతంగా బయటకు నెడుతుంది.
 • దగ్గు, జలుబు లాంటి వాటికి బెల్లం మంచి ఔషధం. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు బెల్లంను వేడి నీటితో కానీ, టీలో వేసుకుని కానీ తాగితే మంచిది.
 • రక్తాన్ని శుద్ధి చేసే లక్షణాలు బెల్లంలో ఉన్నాయి.
 • ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వలన రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది.
 • శ్వాసనాళం, ఊపిరితిత్తులు, పేగులు, పొట్ట, అన్నవాహిక.. వీటన్నింటినీ శుభ్రం చేసే శక్తి బెల్లంకి ఉంది. గనులు, ఫ్యాక్టరీలు, సిమెంటు పనులు, ఇంకా కాలుష్యంతో కూడిన ప్రాంతాల్లో పనిచేసేవారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది.
 • ప్రి మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ కారణంగా నెలసరికి ముందు ఇబ్బందులు పడేవారు, ఆ సమయంలో నొప్పులను అనుభవించేవారు దీన్ని తీసుకుంటే సమస్యలు తగ్గుముఖం పడతాయి.
 • బెల్లంలో ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ ఉండటం వలన రక్తలేమిని నివారిస్తుంది. ఎర్రరక్త కణాలు తగ్గకుండా కాపాడుతుంది. ముఖ్యంగా గర్భిణులకు మరింత మేలు చేస్తుంది.
 • ఇందులో మెగ్నీషియం ఎక్కువ మోతాదులో ఉండటం వలన పేగులకు బలం చేకూరుస్తుంది. ప్రతి పది గ్రాముల బెల్లంలో 16 మిల్లీ గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. అంటే ఇది మనకు ఒకరోజుకి కావాల్సిన మెగ్నీషియంలో నాలుగోవంతుని అందిస్తున్నట్టు లెక్క.
 • బెల్లం శరీర ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరిస్తుంది. దీని వలన శరీరం చల్లబడుతుంది. అందుకే ఎండాకాలంలో చల్లని నీళ్లలో బెల్లం కలుపుకుని తాగమని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు.
 • ఇందులో పొటాషియం, సోడియం ఉండటం వలన శరీరంలో యాసిడ్స్‌ లెవల్స్‌ను సక్రమంగా ఉంచేశక్తి దీనికి ఉంది. రక్తపోటుని సైతం క్రమబద్ధీకరిస్తుంది కూడా.
 • శ్వాసక్రియ సమర్ధవంతంగా ఉంచడంలో బెల్లం శక్తివంతంగా పనిచేస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్‌ లాంటి సమస్యలను దూరం చేస్తుంది. నువ్వులతో కలిపి దీన్ని తీసుకుంటే శ్వాసకోశ వ్యవస్థకు అద్భుతమైన మేలు చేస్తుంది.
 • జాయింట్‌ నొప్పులతో బాధపడుతున్న వారికి బెల్లం మంచి ఔషధమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాస్తం బెల్లం ముక్కని అల్లంతో కలిపి తీసుకుంటే నొప్పులకు ఉపశమనంగా ఉంటుంది. అలాగే పాలల్లో బెల్లం కలుపుకుని తాగినా ఎముకలకు మంచిది.3
 • బెల్లం బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఇందులో ఉన్న పొటాషియం, కండరాల నిర్మాణంలో మెటబాలిజంని పెంచడంలో శరీరంలో నీటిని తగ్గించడంలో తోడ్పడి బరువుని అదుపులో ఉంచుతుంది.
 • పంచదార కంటే శరీరానికి శక్తిని ఇవ్వడంలో బెల్లం మరింత సమర్ధవంతంగా పనిచేస్తుంది. పంచదారలా ఒక్కసారిగా కాకుండా శరీరానికి ఎక్కువ సమయం కార్బోహైడ్రేట్‌లను ఇవ్వగలుగుతుంది. అందువల్ల రక్తంలో ఒక్కసారిగా షుగర్‌ స్థాయి పెరగదు.
 • అలాగే బెల్లం శరీరంలో అలసటని, బలహీనతని పోగొడుతుంది. బెల్లంలో ఇన్ని అద్భుత గుణాలుండటం విశేషమే. అయితే ఇందులో కేలరీలు ఎక్కువగా ఉండటం వలన తగిన మోతాదులో మాత్రమే తీసుకుంటే మంచిది.
Loading...

Popular Posts