మార్కెట్ లో దొరికే హానికరమైన సబ్బులు వాడే బదులు.. కలబంద తో ఈ సబ్బును ఇంట్లోనే తయారుచేసుకోండి..

ప్రస్తుతమున్న వాతావరణ కాలుష్యం వలన మనం ప్రతి రోజు తప్పక చెయ్యవలసిన పని స్నానం. స్నానం చేయాలంటే ఖచ్చితంగా సబ్బు లేదా బాడీ వాష్ ఉండాల్సిందే, శరీరం మంచిగా ఉండాలంటే రోజుకి కనీసం రెండు సార్లయినా స్నానం చేయాలి,అయితే రెండుసార్లు కాకున్నా ఒకసారి చేసినా శరీరాన్ని మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలి, సాధారణంగా ఎక్కువ మంది స్నానం చేయడానికి వివిధ రకాల సబ్బులని ఉపయోగిస్తారు, చాల మంది సబ్బులని టీవీలలో వచ్చే యాడ్స్ చూసి కొంటారు, కాని మార్కెట్ లో ఉండే సబ్బులలో 70% సబ్బులు మన శరీరానికి హాని కలగజేస్తాయి. కాని మనం ఇంట్లోనే సబ్బును తయారుచేసుకోవచ్చు. మన చర్మ సౌందర్యం కోసం వేలకువేలు ఖర్చు పెట్టే బదులు మన పెరటిలో దొరికే కలబంద తో సబ్బును తయారుచేసుకోవచ్చు.

ఇంట్లోనే కలబంద సబ్బు తయారీ:
1. దాదాపు 110 గ్రాముల కలబంద గుజ్జు
2.110 మిల్లీలీటర్ల కాస్టిక్ సోడా (సూపర్ మార్కెట్లో లభించును)
3.750 మిల్లి లీటర్ల ఆలివ్ ఆయిల్
4.250 మిల్లి లీటర్ల నీరు
5.ఎస్సేన్శియాల్ ఆయిల్
దశల వారిగా తయారీ విధానం :
నీటిని వేడి చేసి, ప్లాస్టిక్ డబ్బాలోకి పోయండి.
దీనికి కాస్టిక్ సోడా కలిపి బాగా కలపండి. ఈ మిశ్రమం చల్లబడటానికి కనీసం ఒక గంట సేపు అలాగే ఉంచండి.
ఈ పద్దతిని గాలి వీచే ప్రాంతంలో చేయటం మంచిది.
సబ్బు తయారే చేసే ముందు గ్లౌస్ ను ధరించండి.
పైన తెలిపిన మిశ్రమం చల్లారే లోపు, చెంచా లేదా చాకు సహాయంతో కలబంద ఆకుల నుండి తాజా గుజ్జును వేరు చేయండి.
ఈ గుజ్జును జెల్ రూపంలో మారే వరకు గ్రైండ్ చేయండి.
ఆలివ్ ఆయిల్ ను కొద్దిసేపు మైక్రోవేవ్ లో ఉంచండి.
కాస్టిక్ సోడా కలిపిన నీటికి ఆలివ్ ఆయిల్ ను కలిపి బాగా కలపండి. మిశ్రమం మందంగా మారే వరకు కలుపుతూనే ఉండండి.
తరువాత దీనికి కలబంద గుజ్జును కలిపి, బాగా కలపండి.
లావెండర్ ఆయిల్, రోజు వాటర్ వంటి ఆయిల్ లను కలపటం వలన మిశ్రమం వాసనను వెదజల్లుతుంది.
ఇలా సిద్దం అయిన మిశ్రమాన్ని అచ్చు ఉన్న లోటు తక్కువగా ఉన్న మూసాలో పోసి ఉంచి, ఒక రోజు వరకు ఆలాగే వదిలివేయండి.
మరుసటి రోజు, ఘన రూపంలోకి మారిన కలబంద సబ్బును ముక్కలుగా కత్తిరించవచ్చు.
ఈ ముక్కలను స్నానానికి వాడే ముందు కనీసం 15 నుండి 30 రోజుల వరకి అలాగే ఉంచటం వలన గట్టి పడతాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)