మీరు రోజూ చేసే పనుల్లోనే ఈ చిన్న చిన్న మార్పులు చేస్తే ఖచ్చితంగా బరువు తగ్గిపోతారు

నాజూకుగా కనపడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి చాలామంది డైటింగ్‌ చేస్తే సరిపోతుందంటుంటారు. కాని డైటింగ్‌ చేయడమనేది అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా డైటింగ్‌ చేసే పద్ధతి సరిగా లేకపోతే మరింత బరువు పెరిగే ఆస్కారముంది. కాబట్టి, మీ రోజువారీ కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చేస్తే తప్పని సరిగా బరువును నియంత్రించుకోవచ్చు. అలాగే మీరనుకున్నట్లు నాజూగ్గాను తయారవ్వవచ్చు.

దీనికి ఏం చేయాలంటే... ప్రతి రోజూ ఉదయం కడుపారా అల్పాహారాన్ని సేవించండి. దీంతో రోజంతా ఉత్సాహంగా మీ పని మీరు చేసుకునేందుకు అవసరమైన శక్తి లభిస్తుంది. ప్రతి రోజూ దాదాపు ఎనిమిది నుంచి పది లీటర్ల మేరకు నీటిని సేవించాలి. ఎందుకంటే నీటిలో ఎలాంటి క్యాలరీలుండవు. కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదు.

అలాగే మీరు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. అందులోను నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లకే ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిలో విటమిన్లు, ఖనిజ పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి.

ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా మధ్య మధ్యలో కొద్దికొద్దిగా ఆహారాన్ని సేవిస్తుండండి. కాని ఇందులో వేపుడు పదార్థాలను మాత్రం తీసుకోకండి. బరువు తగ్గేందుకు మరీ విపరీతంగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే బరువు తగ్గడం మాటటుంచితే అతి వ్యాయామం వల్ల శరీరానికి అలసట తప్ప మరొకటి ఉండదు. 

బరువు తగ్గాలంటే ముఖ్యంగా ఒత్తిడి నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నిం చండి. ఎందుకంటే ఒత్తిడి కారణంగా కొందరు విపరీతంగా తినేస్తుంటారు. అంతేకాదు, ఒత్తిడిగా ఉన్నప్పుడు జంక్‌ ఫుడ్స్‌ ఎక్కువగా లాగిస్తుంటారు. దీంతో బరువు పెరిగిపోవడం ఖాయం. కాబట్టి ఒత్తిడి దరిచేరనీయకుండా ప్రశాంతమైన జీవితాన్ని అలవాటు చేసుకోండి. అలాగే మితంగా ఆహారం తీసుకుంటే సహజంగా బరువు తగ్గి ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)