ఇంట్లో ఇవి ఉంటే ఐశ్వర్యం, అదృష్టం ఎప్పటికీ రావు

Loading...
ప్రతి ఒక్కరికీ సిరిసందలతో తులతూగాలనే కోరిక బలంగా ఉంటుంది. కొందరు ఆ దిశగానే అహర్నిశలు శ్రమించి ధనం కూడబెడతారు. ఇంకొందరు ఎలాంటి ప్రయత్నం లేకుండానే లక్ష్మీ తన ఇంట్లో కొలువుండాలని అదృష్టంపైనే ఆధారపడతారు. ఇంట్లో కొన్ని వస్తువులను భద్రపరుచుకుంటే తమ దశ తిరుగుతుందని మరికొందరు భావిస్తారు.

అయితే, ఇంట్లో పెట్టుకునే కొన్ని వస్తువులు మాత్రం చాలా హానికరమట. వాటిని తమచెంత అట్టిపెట్టుకోవడ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువట. దీంతోపాటు దరిద్రం వెంటాడుతుందని చెబుతోంది వాస్తుశాస్త్రం. కానీ ఇలాంటి వాటిని చాలా మంది మూఢనమ్మకాలుగా కొట్టి పారేస్తారు.

ఇంట్లో సాలీడు గూడు ఉంటే చాలామంది మంచిదని భావిస్తారు. కానీ జీవితంలో అనుకోని ఆర్థిక సమస్యలకు ఇది సంకేతమట. కాబట్టి వెంటనే దాన్ని తొలగించి ఇంటిని శుభ్రం చేసుకోవాలట.

ఇంట్లో పాపురాల గూడు ఉంటే ధనం కర్పూరంలా కరిగిపోతుంది, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ఒకవేళ ఇంట్లో మీకు తెలియకుండానే పావురాలు గూడుపెట్టుకుని ఉంటే వెంటనే తొలగించాలట.

తేనె పట్టు ఇంట్లో ఉంటే చాలా అపాయం అని గుర్తించండి. ఇవి మనకు హాని చేయడమే కాదు దురదృష్టానికి కూడా సంకేతమట. కొందరు మాత్రం దీన్ని అదృష్టంగా భావిస్తారు.
వాస్తు ప్రకారం పగలిపోయిన అద్దాలు ఇంట్లో ఉంచకూడదట. ఇవి ప్రతికూల శక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తాయట. అలాగే దరిద్రం కూడా తాండవం చేస్తుందట. కాబట్టి పగిలిపోయిన అద్ధం ఇంట్లో ఉంటే బయటపడేయాలట.

చాలామంది పాత వస్తువులన్నింటినీ ఇంటి మేడపై పడేసి డంపింగ్ యార్డ్ మాదిరిగా మార్చేస్తారు. టెర్రస్‌పై ఇలా వాడి పడేసి వస్తువులు వేస్తే దురదృష్టం వెంటాడుతుందట. ఒకవేళ ఎవరైనా ఇలా చేస్తే దాన్ని శుభ్రం చేసుకుంటే మంచిదని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.
Loading...

Popular Posts